43 medical students test Covid positive in Karimnagar కరీంనగర్ మెడికల్ కాలేజీలో ఒమిక్రాన్ కలకలం..? 43 మంది విద్యార్థులకు కరోనా..

Omicron scare in telangana 43 medical students test covid positive in karimnagar

COVID-19, Omicron, covaxin, phfi, covid variant, covid, icmr, Omicron india, covid, delta variant, omicron symptoms,what are the symptoms of omicron,what are the symptoms of omicron virus, COVID booster dose in india, booster dose above 40 years, booster dose at-risk people, Omicron symptoms, Omicron corona variant, Omicron B.1.1.529, covid new variant, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, nationwide vaccination drive, vaccination drive, covid news, corona updates

Amid the Omicron variant scare, at least 43 medical students at the Chalmeda Anand Rao Institute of Medical Sciences in Bommakal, Telangana’s Karimnagar district have tested positive for COVID-19, prompting the campus’s closure and suspension of Sessions.

కరీంనగర్ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం..? 43 మంది విద్యార్థులకు పాజిటివ్..

Posted: 12/06/2021 01:37 PM IST
Omicron scare in telangana 43 medical students test covid positive in karimnagar

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాలకు విస్తరించడం.. అందునా భారతదేశంలోని కర్ణాటకలో వెలుగుచూసి.. ఇటు మహారాష్ట్ర అటు గుజరాత్, రాజస్థాన్ తరువాత తాజాగా ఢిల్లీలోనూ తాజా కేసులు నమోదు కావడంతో.. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేకెత్తుతోంది. దేశంలో ఇప్పటివరకు ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా ఇవాళ్టి వరకు 21 మందికి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది. ఇటు తెలంగాణలోనూ ఈ నెల 1 నుంచి రాష్ట్రానికి వచ్చిన 900 మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా.. వారిలో 13 మందిలోకి కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని అయితే వీరి నుంచి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం అధికారులు పంపారని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపిన విషయం తెలిసిందే.

ఇదిలావుండగా, తెలంగాణలోని విద్యాసంస్థల్లో కరోనా కేసులు కూడా విజృంబిస్తున్నాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మడలం ముత్తంగి వద్దనున్న బాలికల హాస్టల్ లో 43 మంది విద్యార్థినులకు కరోనా సోకగా, ఆ తరువాత అదే జిల్లాలోని పటాన్ చెరువు మండలం ఇంద్రేశం పరిధిలోని మరో బాలికల హాస్టల్ లోనూ 23 మందికి బాలికలను కరోనా సోకింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయా పాఠాశాల యాజమాన్యాలు.. రంగంలోకి దిగి.. కరోనా సోకిన విద్యార్థులకు అదే హాస్టల్ లో క్వారంటైన్ ఏర్పాటు చేశారు. ఇక తాజాగా కరీంనగర్ జిల్లాలోనూ మెడికల్ కాలేజీలో 43 కరోనా కేసులు కలకలం రేపాయి.  

కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో కనీసం 43 మంది వైద్య విద్యార్థులు కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో అధికారులు తరగతులను రద్దు చేసి క్యాంపస్ ను మూసివేశారు. కాలేజీలో గతవారం వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. అయితే ఈ వెడుకలకు హాజరైన విద్యార్థులు కనీసం జాగ్రత్తలు పాటించకుండా, మాస్క్ లు లేకుండా పాల్గోన్నారని, అదే కరోనా వ్యాప్తికి కారణమయ్యిందని కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా అనుమానం వ్యక్తం చేశారు. కాలేజీలో వార్షికోత్సవాన్ని నిర్వహించే విషయంలోనూ తమకు సమాచారం లేదని అన్నారు.

ఈ వార్షికోత్సవంలో పాల్గోన్నవారిలో ఏకంగా 200 మందిని ఇప్పటివరకు పరీక్షించారు. క్యాంపస్‌లోని మొత్తం 1,000 మందిని పరీక్షించడానికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. శనివారం 13 మంది విద్యార్థులు, ఆదివారం మరో 26 మంది విద్యార్థులు పాజిటివ్‌గా తేలారని తెలిపారు. విద్యార్థులకు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. కరోనా మూడవ దశ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ తగు నియంత్రణ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles