Omicron: India reports first cases of new Covid variant దేశంలో నమోదైన తొలి ‘ఒమిక్రాన్’ కేసులు.. రెండూ కర్ణాటకలోనే..

Omicron variant detected in india two positive cases in karnataka

COVID-19, Omicron, Omicron india, Omicron karnataka, Omicron patients, Omicron symptoms, Omicron corona variant, Omicron B.1.1.529, covid new variant, RT-PCR Test, Rapic Test, covid new mutation, spike protein, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, nationwide vaccination drive, vaccination drive, medical information, isolation protocol, single-day spike, Covaxin, dexamethasone, health ministry, recoveries, positivity rate, safety measures, coronavirus detection, SARS-CoV-2 virus, SARS-CoV-2, medicines, Omicron, South Africa, Botswana, Hong kong, covid news, corona updates

"Two cases of Omicron variant have been reported in the country so far. Both cases are from Karnataka," Lav Agarwal, joint secretary, Union health ministry, said. Adding that the patients have not reported any severe symptoms so far. "All primary contacts and secondary contacts of both the cases have been traced and are being tested," Agarwal further said.

దేశంలోకి చోచ్చుకోచ్చిన ‘ఒమిక్రాన్’.. కర్ణాటకలో రెండు కేసులు..

Posted: 12/02/2021 05:49 PM IST
Omicron variant detected in india two positive cases in karnataka

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతుందన్న వార్తలను నిజం చేస్తోంది. గత అక్టోబర్ లోనే వెలుగుచూసిన ఈ వేరియంట్ యూరోపియన్ యూనియన్ దేశాల్లోని దాదాపుగా 20 దేశాలకు కూడా విస్తరించిందన్న వార్తలు వెలుగచూసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా 29 దేశాలకు విస్తరించిందని.. అందులో భారత్ దేశం కూడా ఉందని తెలింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జాయింట్ కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇవాళ న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

ఇటీవల దేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ తో బాధపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. భారత దేశంలోనే వీరిరువురు ఒమిక్రాన్ మహమ్మారితో బాధపడుతున్న తొలి పేషంట్లని ఆయన తెలిపారు. విదేశాల నుంచి కర్ణాటక వచ్చిన ఇద్దరు పురుషుల్లో ఈ వేరియంట్‌ బయటపడినట్లు వెల్లడించింది. వీరిలో ఒకరి వయస్సు 68 ఏళ్లు కాగా మరోకరు 46ఏళ్ల వయస్సువారని, అయితే భద్రత రిత్యా వారి పేర్లను వెల్లడించడం లేదని తెలిపారు. కాగా ఒమిక్రాన్ గురించి అందోళన అవసరం లేదని, అవగాహన, అప్రమత్తత అవసరమని ఆయన అన్నారు.

వీరిలో ఎలాంటి విపరీతమైన లక్షణాలు బయటపడలేదని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వీరిు కరోనా పాజిటివ్ బారిన పడ్డారని అన్నారు. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం ద్వారా వారికలో ఒమిక్రాన్ నిర్థారణ అయినట్టు తెలిపారు. వారిద్దరిలో ఒమిక్రాన్‌ ఉన్నట్టు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జోనోమిక్స్‌ కన్సార్టియం నిర్ధారించిందని లవ్ కుమార్ తెలిపారు. అయితే వారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించామనీ, వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

కరోనావైరస్ లో ఒమిక్రాన్ ఒక వేరియంట్ మాత్రమేనని, దీనిని కరోనాను నియంత్రణకు వినియోగించిన మార్గదర్శకాలను పాటిస్తే చాలునని కేంద్ర అరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం మరవొద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ తప్పనిసరిగా రెండు డోసుల టీకా తీసుకోవాలని కోరారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం 37 ప్రయోగ శాలలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఒమిక్రాన్‌ ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీ-పీసీఆర్‌ తప్పనిసరి చేసినట్టు తెలిపారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే ప్రత్యేక చికిత్సకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా సరే వారం రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉంచనున్నట్టు తెలిపారు.

ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాతో పాటు యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేయడానికి కారణం అది అత్యంత వేగంగా విస్తరించడం..32 ఉత్పరివర్తనాలను కలిగివుండడం. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఏకంగా 373 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, కాగా దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు వెలుగుచూసినట్టు తెలిపారు. ఇక బోట్స్ వానాలో 19, నెదర్లాండ్స్ లో 16, జర్మనీలో 10, అస్ట్రేలియాలో 8, యూకేలో 32, ఇజ్రాయిల్ 2, బెల్జియంలో 2, స్పెయిన్లో 2,  కెనడాలో 7, స్వీడన్ లో 4, స్విట్జర్లాండ్లో 3, పోర్చుగల్ లో 13, జపాన్లో 2, ప్రాన్స్లో 1, ఘనాలో 33, దక్షిణ కొరియాలో 3, నైజీరియాలో 3, బ్రెజిల్ లో 2, నార్వేలో 2, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యూఏఈలలో ఒక్కక్కటి చోప్పున నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles