Passenger from South Africa tests positive in Mumbai ఒమిక్రాన్ కేసుతో ముంబైలో అలర్డ్.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి..

Passenger from south africa tests positive in mumbai

Mumbai news, Mumbai local news, Mumbai breaking news, Mumbai, Navi Mumbai news live, Coronavirus Live Updates, Mumbai Coronavirus Cases, Mumbai News Today, Coronavirus Cases in Mumbai, covid, Mumbai high alert, Mumbai lockdown, Mumbai news lockdown today, Mumbai covid update, Mumbai news updates, Mumbai covid 19, Mumbai covid cases, Mumbai coronavirus, Mumbai coronavirus death, Mumbai covid updates, Mumbai active covid-19 cases, mumbai covid-19 cases, Mumbai, Maharashtra

A 32-year-old resident of Dombivli in Mumbai, who arrived from South Africa via Delhi on November 24, tested positive upon arrival, though health officials are yet to ascertain if he is infected with the Omicron variant of Covid-19.

ఒమిక్రాన్ కేసుతో ముంబైలో అలర్డ్.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి..

Posted: 11/29/2021 01:35 PM IST
Passenger from south africa tests positive in mumbai

దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి చేరుకుంటున్న వారిలో పలువురు కొవిడ్ బాధితులుగా తేలుతున్నారు. సౌతాఫ్రికా నుంచి శనివారం బెంగళూరు చేరుకున్న ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, తాజాగా మహరాష్ట్రలోని పూణెలో మరో కేసు బయటపడింది. ముంబైలోని డొంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. తాజాగా న్యూఢిల్లీ మీదుగా ముంబైకి చేరుకున్నాడు. అయితే అతను కరోనాతో బాధపడుతున్నాడని అధికారులు పరీక్షలు జరిపిన అనంతరం గుర్తించారు. కాగా, అతడికి సోకింది భారత్ లో ప్రభావం చాటుతున్న డెల్టా వేరియంటా లేక దక్షిణాఫ్రికాలో జడలు విప్పిన నూతన వేరియంట్ ఒమిక్రానా.? అన్నది తెలుసుకునే పనిలో వైద్యుల బృందం ఉంది.

సదరు వ్యక్తికి సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అయి ఉంటుందన్న అనుమానంతో నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం ఫూణేలోని వైరాలజీ కేంద్రానికి పంపించారు. బాధితుడిని కల్యాణ్-డోంబివ్లీ మునిసిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ)లోని ఆర్ట్ గ్యాలరీలో ఐసోలేషన్ చేశారు. ఈ తరుణంలో కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కెడిఎంసి) అధికారులు మాట్లాడుతూ విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశామని, ఆ వ్యక్తి సహ-ప్రయాణికుల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. కాగా, ప్రస్తుతం ఈ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని కేడీఎంసీ ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతిభా పన్‌పాటిల్ తెలిపారు. బాధితుడి సోదరుడికి మాత్రం కరోనా నెగటివ్ అని తేలిందన్నారు.

ఇదిలావుండగా.. ఒమిక్రాన్ వేరియంట్‌పై పెరుగుతున్న ఆందోళనల మధ్య, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసీ) దక్షిణాఫ్రికాతో సహా ఒమిక్రాన్ ప్రభావం చూపుతున్న పలు దేశాల నుంచి గత పక్షం రోజుల వ్యవధిలో నగరానికి చేరకున్న 466 మంది ప్రయాణికుల జాబితాను సేకరించిన అధికారులు వారిని సంప్రదించడం ప్రారంభించారు. వారి నుంచి నమూనాలను కూడా సేకరిస్తున్న అధికారులు వాటిని పరీక్షలకు కూడా పంపి.. వారికి కరోనా లేదని నిర్థారణ చేసుకుంటున్నారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించి కరోనా ఉందని తేలితే జీనోమ్ పరీక్షలకు పంపుతామని అధికారులు తెలిపారు.

గత పక్షం రోజులుగా ముంబైకి చేరుకున్న 466 మంది ప్రయాణికుల్లో 97 మంది నగరవాసులని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ ప్రభావిత దేశాలకు నుంచి నగరానికి చేరుకన్నా లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణించిన ప్రయాణీకులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు రోజుల ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌ను తప్పనిసరి చేసేందుకు చర్యలను చేపడుతోందని తెలిసింది. దేశీయ ప్రయాణీకుల కోసం, రాష్ట్రంలోకి ప్రవేశించడానికి తప్పనిసరిగా ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్షను నిర్వహించాలనే నిబంధనను ప్రభుత్వం తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. కాగా, బెంగళూరులో వెలుగు చూసిన రెండు కేసులు ఒమిక్రాన్ కాదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : omicron  south africa  mumbai resident  Dombivli  Kalyan  new Delhi  covid-19 cases  Mumbai  Maharashtra  

Other Articles