'fastest' Justice: Bihar man gets life term in one day's proceedings అత్యాచారం కేసు: ఒక్కరోజు విచారణతో జీవితఖైదు, జరిమానా

In india s fastest rape case conviction bihar man gets life term in one day s proceedings

Bihar, Rape cases, fastest rape trial, Fastest rape case conviction, POSCO, Bihar, Rape case, Bihar rape case, Shashi Kant Rai Crime

In one of the fastest trials ever, a POCSO court in Bihar's Araria district has sentenced a man in just one day's proceedings to life term imprisonment for raping an eight-year-old girl. The verdict is considered the fastest delivered by any POCSO court in the country.

న్యాయవ్యవస్థలోనే తొలిసారి: ఒక్కరోజు విచారణతో జీవితఖైదు, జరిమానా

Posted: 11/29/2021 12:33 PM IST
In india s fastest rape case conviction bihar man gets life term in one day s proceedings

సాధారణంగా కోర్టుల్లో కేసుల విచారణ నత్తనడకన సాగుతాయన్ని విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితులను అధిగమించడానికి స్వయంగా దేశ ప్రధాన న్యాయమూర్తులే ప్రభుత్వాలను న్యాయమూర్తుల నియామకాలను వేగిరంగా చేపట్టాలని కూడా సూచిస్తుంటారు. న్యాయస్థానాల్లో న్యాయం తప్పక లభిస్తుంది కానీ.. అది సకాలంలో మాత్రం కుదరని పని అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కోర్టుల్లో కేసుల విచారణ సంవత్సరాల తరబడి నడుస్తుంది. కొన్ని సందర్భాల్లో కేసులు విచారణలో ఉండగానే నిందితులో, బాధితులో మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి.

టీవీ సిరయళ్ల మాదిరిగా న్యాయస్థానంలో కేసుల విచారణ ఏళ్లకు ఏళ్లు జరిగిన సందర్భాలు కూడా అనేకం వున్నాయి. అయితే న్యాయమూర్తుల బదిలీలు.. పనిఒత్తిడి ఇత్యాదులు కూడా ఈ విచారణ సుదీర్ఘ సమయం కొనసాగడానికి కారణం. న్యాయస్థానంలో టీవీ సీరియళ్ల తరహాలో కాకుండా కేవలం మూడు గంటల సినీమా తరహాలో తీర్పులు వస్తే.. అది దేశంలో న్యాయవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అయితే, దేశంలోనే తొలిసారిగా బీహార్‌లోని పోక్సో కోర్టు ఒక్క రోజులోనే కేసును విచారించి సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని అరారియా జిల్లాకు చెందిన వ్యక్తి జులై 22న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆ తర్వాతి రోజు కేసు నమోదైంది.

అక్టోబరు 4న కేసు విచారణకు రాగా అదే రోజు పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్ నిందితుడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అంతేకాదు, బాధితురాలికి రూ. 7 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించారు.ఈ కేసుకు సంబంధించిన తీర్పు కాపీ తాజాగా వెలుగు చూసింది. పోస్కో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్‌లాల్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ, “అరారియాలో జరిగిన కేసు దేశంలోనే అత్యంత వేగవంతగా తీర్పును వెలువరించిన కేసు అని తెలిపారు.

అంతకుముందు 2018 ఆగస్టు నెలలో మధ్యప్రదేశ్ లోని దాతియా జిల్లాలోని ఒక కోర్టు మూడు రోజుల్లో అత్యాచారం కేసు విచారణను ముగించి దోషికి శిక్షను ఖరారు చేసిందని అయితే తాజాగా అరారియా పోస్కో న్యాయస్థానం తీర్పు ఆ రికార్డును అధిగమించిందని తెలిపారు. సాక్షులు, వాదనలు మరియు ప్రతివాదనలను నమోదు చేయడం ద్వారా న్యాయస్థానం విచారణను వేగవంతం చేసింది; నిందితులను దోషులుగా నిర్ధారించి కేవలం ఒక్కరోజులోనే తీర్పు వెలువరించింది.ఒక్క రోజులోనే కేసు విచారణ పూర్తై తీర్పు వెలువడడం దేశంలోనే ఇది తొలిసారని బీహార్ హోంశాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles