Tripura: Bomb Scare At Agartala Airport అగర్తలా విమానాశ్రయంలో బాంబు కలకలం..

Suspicious bag triggers bomb scare at agartala airport

Agartala airport, Maharaja Bir Bikram (MBB) airport, suspicious bag, TMC, abhishek banerjee, explosives, Tripura, Crime

A suspicious bag was found at the Maharaja Bir Bikram (MBB) airport in Agartala, airport authorities said on Monday. A bomb squad and airport security were rushed to the spot to look for possible explosives.

అగర్తలా విమానాశ్రయంలో అనుమానాస్పద బ్యాగు.. బాంబు కలకలం..

Posted: 11/22/2021 03:31 PM IST
Suspicious bag triggers bomb scare at agartala airport

ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఇవాళ కాసింత అందోళన వాతావరణం అలుముకుంది.. రాజధాని అగర్తలా విమానాశ్రయంలో ఇవాళ కలకలం రేగింది. బాంబు భయం అలుముకోవడంతో ఎయిర్ పోర్టులోని ప్రయాణికులు భయాందోళన చందారు. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగు కనిపించడం.. ప్రయాణికులు హడలిపోయారు. అందులో ఏదైనా పేలుడు సామాగ్రి ఉండవచ్చునని అనుమానించిన ప్రయాణికులు వెంటనే సమాచారాన్ని విమానాశ్రయ అధికారులకు చేరవేరగా, వారు బాంబు స్వ్కాడ్ అధికారులకు సమాచారం అందించారు. బ్యాగెును పరిశీలించిన బాంబు స్వ్కాడ్.. బ్యాగులో ఎలాంటి పేలుడు సదార్థాలు లేవని చెప్పిన తరువాత ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. త్రిపురలో పురపాలక సంఘాల ఎన్నికల సమరానికి ఈ నెల శంఖం పూరించింది. అగర్తలా సహా మరో 12 నగర మున్సిపాలిటీలకు ఈ నెలలో 25న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో త్రిపురలోని పదమూడు పురపాలక సంఘాలలో ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది. అయితే ప్రచారానికి తెరపడుతున్న క్రమంలో ప్రచారపర్వాన్ని నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే రాజకీయంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న త్రిపురలో పోలీసులు అహర్నిశలు విధులు నిర్వహించి పనిఒత్తడికి లోనవుతున్నారు.

ఈ క్రమంలోనే అగర్తలలోని మహారాజ బిర్ బిక్రమ్ (ఎంబిబి) విమానాశ్రయంలో ఎవరో ఒక బ్యాగును వదిలేసి వెళ్లారు. అయితే కొంత సమయం తరువాత విమానాశ్రయంలోని ప్రయాణికుల దృష్టి ఆ బ్యాగుపై పడింది. దీంతో ఇది ఎవరి బ్యాగు అన్న చర్చ రేగింది. ఎవరికి వారు తమది కాదు అని చెప్పుకోవడంతో అది కాస్తా సీఐఎస్ఎఫ్ అధికారుల దృష్టికి చేరింది. దీంతో వారు ఆ ప్రాంతంతో పాటు విమానాశ్రయాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్వ్కాడ్ ను రప్పించి క్షుణ్ణంగా తనిఖీలు చేయించారు. అయితే బాంబు స్వ్కాడ్ అధికారులు బ్యాగులో ఏలాంటి పేలుడు పధార్థాలు లేవని తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles