Amaravati Farmers: AP Govt to withdraw 3 capital bill అమరావతి రైతుల ఉద్యమం సక్సెస్.. త్రి క్యాపిటల్ బిల్ ఉపసంహరణ

Amaravati farmers protest successful ap govt to withdraw 3 capital bill

Amaravati, Maha Padayatra, Farmers, single Capital, BJP top leaders, Somu Veerraju, Purandeshwari, Kanna Laxmi Narayana, GVL Narasimha Rao, CM Ramesh, Sujana Chowdary, BJP for Amaravati, Andhra Pradesh Politics

After the Union Government withdraws the three farm laws and apologises farmers.. now the state Government also had withdrawn the three capital bill as the Amaravati farmers are protesting the Three capitals desicion nearly two Years.

అమరావతి రైతుల ఉద్యమం సక్సెస్.. త్రి క్యాపిటల్ బిల్ ఉపసంహరణ

Posted: 11/22/2021 01:28 PM IST
Amaravati farmers protest successful ap govt to withdraw 3 capital bill

కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత మూడు రోజుల వ్యవధిలో ఇటు ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తోంది. అక్కడి మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నట్లుగానే ఇక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు. అమరావతి కోసం సుమారు రెండేళ్లుగా ఉద్యమిస్తున్న రైతులకు బీజేపి నేతలు అండగా నిలవాలని చెప్పి సూచనలు చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇవాళ ఈ మేరకు అత్యవసరంగా భేటీ అయిన ప్రభుత్వం భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన చిత్తూరు, నెల్లూరు సహా పలు జిల్లాల అనేక సహాయక చర్యలు చేపట్టాల్సిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ముగించే విషయమై చర్చించడంతో పాటు మూడు రాజధానులు బిల్లుపై కూడా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయాన్ని వెలువరించనున్నట్లు కూడా సమాచారం. రాజధానికి సంబంధించి మరో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మరోవైపు వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్టు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అమరావతి కేసులను విచారిస్తున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కొడాలి నానిని మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ప్రశ్నించగా... అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను బయటకు చెప్పడం నిబంధనలకు విరుద్ధమని... ఆ విషయం గురించి అసెంబ్లీలో సీఎం జగన్ చెపుతారని అన్నారు.

అయితే ఈ బిల్లు ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..  న్యాయపరమైన చిక్కుల వల్లే ఈ పరిస్థితి ఉండొచ్చు. కేబినెట్‌ సమావేశంలో తాను లేనని అన్నారు. అందుకని తనకు పూర్తి వివరాలు తెలీదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని అన్నారు. ఇప్పుడు ఇంటర్వెల్‌ మాత్రమే. శుభం కార్డుకు చాలా సమయం ఉంది. రాజధాని పేరుతో ఉద్యమం చేసేది పెయిడ్‌ ఆర్టిస్టులే అని మరోమారు ఉద్ఘాటించిన ఆయన.. సుమారు రెండు రెండున్నరేళ్లుగా టీడీపీ ఈ అర్టిస్టులతో నిరసనలు నిర్వహిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles