Amaravati farmers maha padayatra enters 3rd day 3వ రోజు కోనసాగుతున్న రైతుల మహాపాదయాత్ర

Amaravati farmers maha padayatra enters third day today

Amaravati, slogans, Anti Govt protest, Farmers agitations, Decentralisation, CRDA, Three Capital Plan, United Nations Human Rights Council,united kingdom,law,kaveti srinivas rao,International Criminal Court, Decision Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Chief Justice JK Maheshwari, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Supreme Court, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

The Amaravati farmers, who have been agitating for over 500 days, have launched a Maha Padayatra to Tirupati enters third day highlighting their plight. The farmers are demanding that the Jagan government’s decision to shift the capital out of Amaravati be rescinded.

అమరావతి రాజధాని డిమాండ్.. 3వ రోజు తిరుపతికి రైతుల మహాపాదయాత్ర

Posted: 11/03/2021 02:52 PM IST
Amaravati farmers maha padayatra enters third day today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రెండేళ్లుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న ఆప్రాంత రైతులు తాజాగా అమరావతి నుంచి తిరుపతి వరుకు మహాపాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఇవాళ అమరావతి రైతులు పాదయాత్ర మూడవ రోజు కోనసాగింది. అమరావతి రైతుల నిరసన దీక్షలు ఇవాళ్టికి ఏకంగా 680 రోజులు దాటిన నేపథ్యంలో.. తమ ఉద్యమాన్ని ఇక రాష్ట్రప్రజల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అందుకు ఆ భగవంతుడి ఆశీర్వదాలు కూడా కావాలని చేపట్టిన మహా పాదయాత్ర ఇవాళ మూడో రోజుకు చేరుకుంది.  45 రోజుల పాటు అమరావతి నుంచి తిరుపతి వరకు మహాపాదయాత్ర చేపట్టిన రైతుల పాదయాత్ర ఇవాళ మూడవ రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో రైతులు తమ డిమాండ్ కు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా వ్యవహరించాలని ప్రజలను కూడా కోరనున్నారు.  రాజధాని అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

డిసెంబర్​17న తిరుపతిలో జరిగే బహిరంగ సభతో మహాపాదయాత్ర ముగియనున్నది. తుళ్లూరు నుంచి తిరుమల వరకూ చేపట్టిన మహాపాదయాత్రలో రైతులు, రైతు కూలీలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోరంట్లలో గ్రామస్థులు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికి వారికి బస ఏర్పాట్లు చేశారు. ఈ పాదయాత్రలో రాజధాని రైతులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. రైతులు, మహిళలు పుల్లడిగుంటలో ఈ రాత్రి విశ్రాంతి తీసుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles