Three top Maoists killed in encounter in Mulugu of Telangana చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్లో ముగ్గురు మావో అగ్రనేతల మృతి

Encounter breaks near telangana chhattisgarh border three top maoists killed

Encounter, Naxal, madvi hidma, maoists, Security forces, Three top Maoists killed, Peruru police station, Wazedu mandal, Mulugu district, Telangana-Chhattisgarh border, Mulugu, Telangana, Chhattisgarh, crime

Three top leaders of the outlawed CPI (Maoists) were killed in an encounter with the police party of greyhounds on the border of the Mulugu district of Telangana State and Bijapur district of Chhattisgarh state on Monday morning, while the police were combing the forest areas in search of the Maoists.

మావోలకు ఎదురుదెబ్బ.. చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్లో ముగ్గురు అగ్రనేతల మృతి

Posted: 10/25/2021 11:13 AM IST
Encounter breaks near telangana chhattisgarh border three top maoists killed

ఇప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలలో పలు జిల్లాలకు మాత్రమే పరిమితమై క్రమంగా ఉనికి కోల్పోతున్న మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు నేతలు హతులయ్యారు. తెలంగాణ – ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులో సోమ‌వారం ఉద‌యం భీక‌ర‌మైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసు బ‌ల‌గాలు, మావోయిస్టుల మ‌ధ్య జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని ములుగు జిల్లా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ స‌రిహ‌ద్దులో చోటు చేసుకుంది.

తెలంగాణ పోలీస్, గ్రే హౌండ్స్ ద‌ళాలు క‌లిసి తెలంగాణలోని ములుగు జిల్లా, వాజేడు మండల పరిధిలోని పేరూరు పోలిస్ స్టేషన్ పరిధిలో సంయుక్తంగా కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో బీజాపూర్‌, ములుగు సరిహ‌ద్దులోని త‌ర్ల‌గూడ వ‌ద్ద మావోయిస్టులు పోలీసుల‌కు తార‌స‌ప‌డ్డారు. దీంతో భద్రతా బలగాలపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసిన మావోలకు వారి నుంచి ధీటుగా బదులు వచ్చింది. భద్రతా బలగాలు కూడా కాల్పులకు జరపడంతో.. ఇరు వ‌ర్గాల మ‌ధ్య కొంత సమయం భీకరంగా ఎదురుకాల్పులు జ‌రిగాయి.

కాగా పోలీసుల కాల్పుల్లో తప్పించుకునే పరిస్థితి లేకపోవడం తూటలు తగలడంతో ముగ్గురు మావోయిస్టు నేతలు మరణించారు. కాగా ఈ ఎన్ కౌంటర్ పై ఎటూరు నాగారం ఏఎస్సీ గౌష్ ఆలమ్ మాట్లాడుతూ మరణించిన ముగ్గురు మావోయిస్టులను గుర్తించే పనిలో వున్నామని, అయితే వారి వద్ద నుంచి ఎస్ఎల్ఆర్, ఏకే-47 రైఫిళ్ల‌ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ ఆయుధాలు వారి వద్ద లభ్యం కావడంతోనే వారు డీసిఎం క్యాడర్ స్థాయి నేతలుగా భావిస్తున్నామని అన్నారు. వీరు హిద్మా అలియాస్ హిద్మాలు, అలియాస్ సంతోష్ దళానికి చెందిన మావోయిస్టు సభ్యులుగా అనుమానిస్తున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Encounter  Naxal  madvi hidma  maoists  Security forces  Three top Maoists killed  Mulugu  Telangana  Chhattisgarh  crime  

Other Articles