టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ నివాసంతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యాలయం, విశాఖపట్నంతో పాటు పలు ప్రాంతాల్లోని టీడీపీ కార్యాలయాలపై అగంతకులు దాడులకు తెగబడటాన్ని పలు రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. అధికారంలోని పార్టీ తమ అనుచరులతో ప్రత్యర్థి పార్టీ కార్యాలయాలపై దాడులకు తెగబడటాన్ని తీవ్రంగా ఖండించాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ దాడులను నిర్ద్వందంగా ఖండించారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా దాడులను ఖండించింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఏపీ బీజేపి అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా దాడులను ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట్లాడుతూ, జనసేన ఐటీ వింగ్ కు సంబంధించిన సమావేశంలో ఉండగా రాష్ట్రంలో టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగినట్టు సమాచారం అందిందని తెలిపారు. తనకు తెలిసినంతవరకు రాష్ట్రంలో పార్టీ ఆఫీసులపై దాడులు జరగడం ఇదే ప్రథమం అని పేర్కొన్నారు. ఇలాంటి దాడుల సంస్కృతి ప్రజాసంక్షేమానికి ఏమాత్రం క్షేమకరం కాదని స్పష్టం చేశారు. పార్టీ ఆఫీసులపైనా, నాయకుల ఇళ్లపైనా దాడులు చేస్తే అది అరాచకానికి, దౌర్జన్యానికి దారితీస్తుంది తప్ప, అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదని పవన్ అభిప్రాయపడ్డారు.
దీనిపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని పవన్ కోరారు. ఏపీ పోలీసు విభాగం కూడా సత్వరమే దీనిపై చర్యలు తీసుకోవాలని, దోషులను పట్టుకుని శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి చిరునామాగా మారుతుందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలే ఇవాళ్టి దాడులకు పాల్పడ్డట్టు చెబుతున్నారని, భవిష్యత్తులో ఇలాంటి ధోరణులను వైసీపీ నేతలు నియంత్రించుకోకపోతే ప్రజాస్వామ్యానికి అది గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ ఓ సందేశం విడుదల చేశారు. ఈ దాడులపై వైఎస్సార్ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు.
ఈ దాడికి పాల్పడినవారు పట్టాభి కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా దూషించినట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఈ దాడులకు కారకులు ఏ పార్టీకి చెందినవారైనా సరే డీజీపీ తక్షణమే చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నేతల మీద, పార్టీ కార్యాలయాల మీద ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి భంగకరం అని తెలిపారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో నేడు జరిగిన సంఘటనలు విషాదకరం అని అభివర్ణించారు. ఇటువంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై జగన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని ఏపీ బీజేపీ తరఫున డిమాండ్ చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని గత రాత్రి ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి బృందం సందర్శించింది. అగంతకుల దాడిలో ధ్వంసమైన కార్యాలయాన్ని పరిశీలించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ ఆదేశాల మేరకు పీసీసీ కార్యదర్శి నూతలపాటి రవికాంత్, ప్రధాన కార్యదర్శి చిలకా విజయ్‌కుమార్, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ సలీం తదితరులు టీడీపీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం చంద్రబాబును కలిసి మాట్లాడారు. దాడిపై విచారం వ్యక్తం చేశారు. కాగా, దాడికి నిరసనగా టీడీపీ నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more