Yuvraj Singh arrested, released on bail వివాదాస్పద వ్యాఖ్యల కేసులో యువరాజ్ సింగ్ అరెస్ట్..

Chahaal casteist remarks yuvraj singh arrested released on bail

Yuvraj Singh, Yuzvendra Chahal, Instagram, Rohit Sharma, Viral Video, IPC, police case Yuvraj Singh, Yuzvendra Chahal, Instagram, IPC, Police Case. Yuvraj Singh arrest, Yuvraj Singh casteist remark’ case, crime

Haryana Police said former India cricketer Yuvraj Singh was arrested and released on bail in an alleged casteist remarks case in compliance with a High Court order. Singh is accused of making casteist remarks against another cricketer during an Instagram chat last year. The police said it was a “formal arrest” when he had gone to Hansi town in Hisar, and he was released on bail in compliance with the order of the Punjab and Haryana High Court.

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో యువరాజ్ సింగ్ అరెస్ట్.. బెయిల్ పై విడుదల

Posted: 10/18/2021 02:02 PM IST
Chahaal casteist remarks yuvraj singh arrested released on bail

సెలబ్రిటీలు అందులోనా మరీముఖ్యంగా క్రికెటర్లు ఫ్యాన్స్ ఎలా రియాక్టవుతారు అని చూసుకుని వ్యవహరించాల్సి వుంటుంది. కాగా ఓ కులాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసినట్లు అరోపణలు ఎదుర్కోంటున్న ప్రముఖ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అరెస్టు అయ్యారు. టీమిండియా క్రికెటర్‌ యజువేంద్ర చహల్‌ సామాజికవర్గాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్ ను హర్యానా పోలీసులు అరెస్ట్‌ చేసింది. కాగా అవెంటనే బెయిలు కూడా పోందిన ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.

గతేడాది జూన్ లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్ లో పాల్గొన్న యువరాజ్‌.. తోటి క్రికెటర్‌ చహల్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ సమయంలో చహల్‌ సామాజికవర్గాన్ని ప్రస్తావిస్తూ.. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయ్యింది. దీంతో యువరాజ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడిపై కేసులు నమోదు చేయాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుల నుంచి కూడా డిమాండ్ వ్యక్తమయ్యింది.

ఈ క్రమంలో యువరాజ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని, పంజాబ్-హర్యానా హైకోర్టు అదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ ను అదుపులోకి తీసుకు్న పోలీసులల అయనను న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై అతడిని విడుదల చేసినట్టు హర్యానాలోని హన్సికి చెందిన సీనియర్ పోలీసు అధికారి నిటికా గహ్లాట్ తెలిపారు. మరోవైపు, యువరాజ్ ప్రతినిధి షాజ్‌మీన్ కారా మాట్లాడుతూ యువరాజ్ చేసిన కులవివక్ష వ్యాఖ్యలపై గతంలోనే ఆయన క్షమాపణలు చెప్పారని తెలిపారు. యువరాజ్ అరెస్టు అయ్యారన్న వార్తల్లోనూ నిజం లేదని చె్ప్పుకోచ్చారు.

ఈ వివాదంపై స్పందించిన యువరాజ్‌.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లో ట్వీట్‌ చేశారు. అయితే, యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని ఆరోపిస్తూ ఓ న్యాయవాది హిస్సార్‌ పరిధిలోని హాన్సీ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై ఈ ఏడాది లాక్‌డౌన్‌ అనంతరం విచారణ జరిపిన హిస్సార్ పోలీసులు.. యువరాజ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles