Quack lynched for allegedly raping, murdering woman పోలీసుల ఎదుటే బూతవైద్యుడిని కొట్టిచంపిన గ్రామస్థులు

Quack lynched in andhra pradesh for allegedly raping murdering woman

Quack lynched in kamepally, Quack lynched in jarugumalli mandal, Quack lynched in prakasam district, Quack lynched in Andhra Pradesh, quack rape attempt in andhra pradesh, Quack inebriated condition, local quack obaiah, Vallepu Obaiah, Andhra Police, Lynching, Rape, Woman, Prakasam, Andhra Pradesh Crime

A 60-year-old quack was lynched on the suspicion of killing a 42-year-old woman when she resisted his alleged rape attempt in Andhra Pradesh’s Prakasam district on Sunday night, police said. M Lakshman, a local police officer, cited preliminary investigation and said Vallepu Obaiah, the quack, was in an inebriated condition when he allegedly attempted to rape the woman when she visited him for treatment for joint pains.

ITEMVIDEOS: పోలీసుల ఎదుటే బూతవైద్యుడిని కొట్టిచంపిన గ్రామస్థులు

Posted: 10/18/2021 11:49 AM IST
Quack lynched in andhra pradesh for allegedly raping murdering woman

దీర్ఘకాలిక రోగాలను కూడా చిటికలో తరిమేస్తానని, అవి రోగాలు కాదు.. మరోదే ప్రభావం చేత అలా జరుగుతుందని మాయమాటలు చెప్పి ప్రజల అమాయకత్వాన్ని అసరాగా చేసుకుని డబ్బును లాగేయడం అలవాటైన భైతవైద్యులు గురించి మనకు తెలిసిందే. అయితే డబ్బులు ఆర్జించడంతోనే వీరి ఆశలకు కళ్లాలు పడటం లేదు.. మరో అడుగుముందుకేసి.. తమ వద్దకు వచ్చే వారిపై అకృత్యాలకు తెగబడటం కూడా చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన అమాయక మహిళ ప్రాణాలను బలిగోన్న ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఓ భూతవైద్యుడిని శిక్షించిన గ్రామస్థులు రాష్ట్రంలోని భూతవైద్యులందరికీ గుణపాఠం చెప్పారు.

చికిత్స కోసం తన వద్దకు వచ్చిన మహిళపై కన్నేసిన భూతవైద్యుడు అమెను ఆదివారం రోజు సాయంత్రం ఇంటికి పిలిపించాడు. చికిత్సలో భాగంగా అమెను పిలిచిన ఆయన అమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు గట్టిగా అరచింది. దీంతో ఓ పదునైన వస్తువుతో అమెపై తెగబడిన భూతవైద్యుడు అమె గొంతు కోసి చంపేశాడు. తన ఇంటి నుంచి బయటకు కంగారుగా వచ్చిన ఆయనను చూసిన గ్రామస్థులు.. విషయాన్ని గ్రహించి ఆగ్రహంతో ఊగిపోయి అతడ్ని కర్రెలు, రాడ్లతో దారుణంగా కొట్టడంతో భూతవైద్యుడు అక్కడికక్కడే మరణించాడు. అయితే ఈ ఘటనలో అడ్డుకున్న పోలీసులకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో దీర్ఘకాలంగా.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ స్థానిక భూత వైద్యుడైన వల్లెపు ఓబయ్య (60) వద్ద గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటోంది. మందులు ఇస్తానంటూ ఆమెను ఇంటికి పిలిచిన నాటు వైద్యుడు మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పదునైన కత్తితో ఆమె గొంతుకోశాడు. ఆ సమయంలో ఆమె పెద్దగా కేకలు వేసినా.. చికిత్సలో భాగంగా అరుస్తోందని అనుకున్న ఇరుగు పొరుగువారు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రాత్రి కంగారుగా తిరుగుతున్న ఓబయ్యను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న స్థానికులు, బాధిత మహిళ కుటుంబ సభ్యులు, భర్త, కుమారులు పోలీసుల అదుపులో ఉన్న ఓబయ్యపై దాడికి పాల్పడ్డారు. గ్రామస్థులు ఒక్కసారిగా దాడిచేయడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. దీంతో అదనపు బలగాల కోసం ఫోన్ చేశారు. అయితే, అవి వచ్చేలోపే ఓబయ్యను గ్రామస్థులు కర్రలతో కొట్టి చంపేశారు. ఇది చూసిన ఎస్ఐ రజియా సుల్తానా కళ్లుతిరిగి పడిపోయారు. సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్ అదనపు బలగాలతో గ్రామానికి చేరుకునే సరికే ఓబయ్య హతమయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Quack  Vallepu Obaiah  Andhra Police  Lynching  Rape  Woman  Prakasam  Andhra Pradesh Crime  

Other Articles