Aryan Khan Regular Consumer Of Drugs says NCB జైలులో బోజనం, నీరు సరిగ్గా తీసుకోని ఆర్యన్ ఖాన్

Aryan khan to stay in jail bail order reserved for october 20

Nawab Malik, Narcotics Control Bureau (NCB), Aryan khan, BJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, Sameer wankhede, Showik Chakraborty, Rhea Chakraborty, aryan khan Arthur Road jail Jail food, Aryan khan bail plea reserved, NCB court, mumbai cruise drugs case, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, sameer wankhede, ncb, Crime

Bollywood star Shah Rukh Khan's 23-year-old son Aryan Khan did not get bail in the drugs-on-cruise case today from a Mumbai sessions court that reserved the order till Wednesday, sending him back to jail. The NCB today told the court that "evidence showed" Aryan Khan frequently took banned substances

ముంబై డ్రగ్స్ కేసు: ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ 20కి వాయిదా వేసిన కోర్టు

Posted: 10/14/2021 05:32 PM IST
Aryan khan to stay in jail bail order reserved for october 20

ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జ‌రిగిన రేవ్ పార్టీలో పట్టుబడిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ బెయిల్  పిటీషన్ ను ఈ నెల 20 వ తేదికి న్యాయస్థానం వాయిదా వేసింది. ఇవాళ అర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై ఇరువర్గాల తరపు వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 20కి తీర్పును రిజర్వు చేసింది. కాగా అర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వరాదని ఎన్సీబి అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై ఘాటైన సమాధానం ఇచ్చిన ఎన్సీబి.. ఆర్యన్ ఖాన్ కేసులోను రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి కేసుతో పోల్చింది. అర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ లభ్యంచలేదని అంతమాత్రన అతినికి బెయిల్ ఇవ్వాలని ఏమీ లేదని  ఏఎస్‌జీ అనిల్ సింగ్ కోర్టులో వాదించారు.

గ‌తంతో రియా సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తి ద‌గ్గ‌ర కూడా ఎలాంటి డ్ర‌గ్స్ ల‌భించ‌క‌పోయినా.. దీనిపై విచార‌ణ జ‌ర‌గాల‌ని కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక కొరడిలా క్రూజ్ కేసులోనూ ఆర్య‌న్ ఖాన్ కేసును లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. గ‌త కొన్నేళ్లుగా రెగ్యుల‌ర్ గా డ్ర‌గ్స్ తీసుకుంటాడ‌ని మీ ముందు ఉన్న రికార్డు, ఆధారాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఆర్య‌న్ ఫ్రెండ్ అర్బాజ్ ఖాన్ ద‌గ్గ‌ర ల‌భించిన డ్ర‌గ్స్ వాళ్లిద్ద‌రూ తీసుకోవ‌డం కోస‌మే అని అనిల్ సింగ్ వాదించారు. ఆర్య‌న్‌కు బెయిల్ ఇవ్వ‌కూడ‌ద‌ని ఆయ‌న కోర్టును కోరారు.

ఇదిలావుండగా, ప్రస్తుతం ముంబైలోని అర్థర్ రోడ్డులోని కారాగారంలో రిమాండ్ ఖైదీగా వున్న ఆర్యన్‌ ఖాన్.. జైలు జీవితాన్ని అనుభ‌వించ‌లేక‌, బ‌య‌ట‌కు రాలేక మాన‌సిక వేధ‌న‌ అనుభ‌విస్తున్నాడని సమాచారం. జైలులో అతడు సరిగ్గా భోజనం చేయట్లేడని, నీళ్లు కూడా స‌రిగ్గా తాగ‌ట్లేడదని జైలు అధికారులు తెలిపినట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అందుకు పెద్ద కారణమే ఉంది. పబ్లిక్ టాయిలెట్స్ మాదిరిగా నిత్యం కంపుకోట్టే జైలు టాయిలెట్లు వాడేందుకు అయిష్టతను వ్యక్తం చేస్తున్న ఆయన.. ఈ కారణంగానే భోజనం, నీళ్లు తీసుకోవడం లేదట.

అతని ప‌రిస్థితిని గమ‌నించిన జైలు అధికారులు ఆర్యన్ ‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. భోజనం, నీరు తీసుకోవాలని, టాయిలెట్‌ను వాడుకోవాలని చెబుతున్నారు. అయినా వారి మాటను ఆర్యన్‌ వినడం లేదు. ఆకలి వేయడం లేదని చెప్పేస్తున్నాడట. అయితే బోజనం, నీరు సరిగ్గా తీసుకోని పక్షం అనారోగ్యం బారిన పడే అవకాశాలు అధికంగా వున్నాయిన జైలు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నా.. వాటిని అర్యన్ ఖాన్ తిరస్కరిస్తున్నాడట. జైలులో ఆర్యన్‌ ఖాన్‌ నాలుగు రోజులుగా స్నానం కూడా చేయలేదు. అత‌డి ఆరోగ్యం గురించి జైలు అధికారుల ద్వారా షారుఖ్ ఖాన్‌ వివరాలు తెలుసుకుంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles