"May Tejashwi Yadav Become Chief Minister" తేజస్వీ సీఎం కావాలని అభిలాషించిన తేజ్ ప్రతాప్

May tejashwi yadav become chief minister tej pratap after meeting mother

Tej Pratap Yadav, Tejashwi Yadav, Jayaprakash Narayan, Lalu Prasad, Rabri Devi, chief minister, Bihar news, National Politics

Lalu Prasad's elder son Tej Pratap Yadav put paid to speculations of his canvassing for rebel candidates, as a mark of protest over his name being omitted from the list of star campaigners and asserted that he wished younger brother Tejashwi Yadav to rise to the chief minister's chair.

రబ్రిదేవి మంత్రాంగం: తేజస్వీ సీఎం కావాలని అభిలాషించిన తేజ్ ప్రతాప్

Posted: 10/14/2021 12:43 PM IST
May tejashwi yadav become chief minister tej pratap after meeting mother

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుల మధ్య ఎట్టకేలకు సయోద్య కుదిరింది. కటకటాల్లోంచి వచ్చిన తండ్రి ఇద్దరి తనయుల మధ్యా రాజీ కుదర్చే ప్రయత్నాలు చేసినా అప్పుడప్పుడూ ఆయన పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ నుంచి ధిక్కార స్వారాలే వినిపించేవి. అయితే ఈ సారి మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ కన్నా రబ్రి దేవీ నడిపిన మంత్రాంగమే మహాద్భుతంగా పనిచేసింది. రాష్ట్రీయ జనతాదళ్ నుంచి టీకెట్లు అశించి భంగపడిన రెబల్ అభ్యర్థుల తరపున తాను బరిలోకి దిగి ప్రచారం చేస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు యూ-టార్న్ తీసుకునేలా చేసింది.

తల్లి మంత్రాంగంతో మెట్టుదిగివచ్చిన తేజ్ ప్రతామ్ యాదవ్.. తన తమ్ముడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి కావాలని అభిలాషించిన ఆయన.. అందుకు తన అశీస్సులు కూడా బలంగా వున్నాయంటూ వ్యాఖ్యానించడం రాజకీయాలలో కొత్త అధ్యయాన్ని లిఖించేట్లుగా మారింది. లెజండరీ సోషలిస్టిక్ మహానేత జయప్రకాశ్ నారాయణ్ జన్మదిన ఉత్సవాల్లో భాగంగా ఆయనను మీడియా ఈ అంశంపై ప్రశ్నించగా, తన తమ్ముడికి తన అశీస్సులు కూడా తోడుగా వుంటాయని అన్నారు. బీహార్‌లో రెండు శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ప్రధాన ప్రచారకర్తల జాబితాలో తన పేరు లేకపోవడం తేజ్‌ప్రతాప్‌‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఆయన తిరుగుబాటు అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నట్టు వార్తలు వినిపించాయి.

అయితే, అంతలోనే ఏమైందో కానీ తన తమ్ముడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ఆశిస్తున్నట్టు నిన్న విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.తాను తిరుగుబాటు అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు అలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయని విలేకరులను ఎదురు ప్రశ్నించారు. ఏది ఏమైనా అన్నదమ్ములు ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం మంచి పరిణామమని ఆర్జేడీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చే వారం పాట్నాలో పర్యటించబోతున్నట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh