Phthalates are dangerously close to everyday materials సింధెటిక్ కెమికల్ లక్షల ప్రాణాలను హరిస్తోంది: అధ్యయనం

Widely used synthetic chemical phthalates linked to 1 00 000 us deaths per year

chemicals, US deaths, phthalates, synthetic chemicals, higher concentrations, Grossman School of Medicine, New York University, biological mechanisms

Daily exposure to phthalates, a group of chemicals used in everything from plastic containers to makeup, may lead to approximately 100,000 deaths in older Americans annually, a study from New York University warned

విరివిగా వాడుతున్న సింధెటిక్ కెమికల్ లక్షల ప్రాణాలను హరిస్తోంది: అధ్యయనం

Posted: 10/13/2021 06:53 PM IST
Widely used synthetic chemical phthalates linked to 1 00 000 us deaths per year

మనం నిత్యం వినియోగించే వ‌స్తువుల్లో ఉండే సింథెటిక్ కెమిక‌ల్.. మన అరోగ్యాన్ని కాటేస్తుందన్న విషయం మీకు తెలుసా.? ఈ సింథెటిక్ రసాయనం ఏదో రూపంలో మ‌న శ‌రీరంలోకి వెళ్తూ.. గుండెకు చేటు చేస్తోందన్న విషయం ఎంతమందికి తెలుసు. ఆ కెమెకిల్ కార‌ణంగా అమెరికాలో ప్ర‌తి ఏటా ల‌క్ష మంది మ‌ర‌ణిస్తున్న‌ారంటే ఇది ఎంతమాత్రం సాధారణ విషయం కాదు. ఇది కరోనా కాటు కన్నా భయకరమైన రసాయనమని అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ తాజా అధ్య‌య‌నం తేల్చింది. యూనివ‌ర్సిటీలోని గ్రాస్ మెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాఖకు చెందిన విద్యార్థులు చేసిన ఈ అధ్య‌య‌నం ఆ కెమిక‌ల్ గురించి ఆందోళ‌న క‌లిగించే విష‌యాలు వెల్ల‌డయ్యాయి.

దీని పేరు థాలెట్స్‌ ఇది ఒక ర‌సాయ‌నాల స‌మూహం. దీనిని మ‌నం వాడే ప్లాస్టిక్ నుంచి మేక‌ప్ సామ‌గ్రి వ‌ర‌కూ చాలా వాటిలో వినియోగిస్తారు. బొమ్మ‌లు, బ‌ట్టలు, షాంపోలు వంటి ప్ర‌తి రోజూ వాడే వ‌స్తువుల్లో ఈ థాలెట్లు ఉంటాయి. కొన్ని ద‌శాబ్దాలుగా ఈ కెమిక‌ల్‌కు హార్మోన్‌ల‌కు భంగం క‌లిగిస్తుంద‌న్న పేరుంది. ఇది ఓ వ్య‌క్తి ఎండోక్రైన్ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతుంది. ఇలాంటి వ‌స్తువుల కార‌ణంగా ఈ విష ప‌దార్థాలు శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయని స‌ద‌రు అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఈ అధ్య‌య‌న ఫ‌లితాల‌ను ఎన్విరాన్‌మెంట‌ల్ పొల్యూష‌న్ జర్న‌ల్‌లో ప్ర‌చురించారు.

న్యూయార్క్ యూనివ‌ర్సిటీకి చెందిన గ్రాస్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించింది. ఇందులో భాగంగా 55 నుంచి 64 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న 5 వేల మందిని పరిశీలించారు. వాళ్ల యూరిన్‌లో థాలెట్ల గాఢ‌త ఎక్కువ‌గా ఉన్న వాళ్ల‌లో గుండె జ‌బ్బులు ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్లు గుర్తించారు. ఈ గుండె జ‌బ్బుల కార‌ణంగానే వాళ్లు చ‌నిపోతున్నార‌ని అధ్య‌య‌నం తేల్చింది. థాలెట్లు నేరుగా మ‌ర‌ణానికి కార‌ణం కాక‌పోయినా.. గుండె జ‌బ్బుల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు.

ఎక్కువ కాలం పాటు థాలెట్లు శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌డం వ‌ల్ల అది గుండె జ‌బ్బుల‌కు దారితీసి అకాల మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న‌ట్లు ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించిన బృందానికి హెడ్ లియొనార్డో ట్రాసండె వెల్ల‌డించారు. థాలెట్ల వ‌ల్ల తాము ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ ప్ర‌మాద‌మే ఉన్న‌ట్లు గుర్తించిన‌ట్లు చెప్పారు. ఈ థాలెట్ల వ‌ల్ల అమెరికాకు ప్ర‌తి ఏటా 4 వేల కోట్ల నుంచి 4.7 వేల కోట్ల డాల‌ర్ల వ‌ర‌కూ ఆర్థిక న‌ష్టం వ‌స్తుంద‌నీ ఈ అధ్య‌యనం తేల్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles