UP govt informs SC, Ashish to be questioned tomorrow లఖీంపూర్ ఘటనపై నివేదిక సమర్పించండీ: సుప్రీం

Lakhimpur kheri violence top court says not satisfied with steps taken by state

UP violence updates, Lakhimpur Kheri violence, CJI NV Ramana, Supreme Court, ShivKumar Tripati, Lakhimpur Kheri, UP Lakhimpur Kheri updates, Lakhimpur Kheri news, Supreme Court, Lakhimpur Violence, UP Violence, UP Violence News, Lakhimpur-Kheri Violence, Lakhimpur kheri protest, Farmer Protest, Priyanka Gandhi, Congress, farmer protest updates, UP Violence Video, Viral Video, Ajay Mishras son, Uttar Pradesh, Crime

Lakhimpur Kheri Incident: Hearing a PIL in the Lakhimpur Kheri violence case, the Supreme Court said it was not satisfied with the steps taken by Uttar Pradesh to address the issue. Appearing for the UP government, advocate Harish Salve said Union Minister of State for Home Ajay Mishra’s son Ashish Mishra has been asked to appear for questioning at 11 am tomorrow. If he doesn’t show up, the rigour of law will kick in, Salve said.

లఖీంపూర్ ఘటన: యూపీ ప్రభుత్వ తీరుపై ‘సుప్రీం’ అసహనం

Posted: 10/08/2021 02:54 PM IST
Lakhimpur kheri violence top court says not satisfied with steps taken by state

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ల‌ఖీంపూర్ ఖేరీలో రైతుల‌ను వాహ‌నంతో తొక్కుతూ వెళ్లిన ఘ‌ట‌న‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. లఖీంపూర్ ఘటనలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తమను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయని పేర్కోంది. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర నిరాశను వ్యక్తపర్చింది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

ఉత్తరప్రదేశ్ పోలీసు యంత్రాంగంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘సాధారణ పరిస్థితుల్లో కూడా పోలీసులు వెంటనే స్పందించకుండా, నిందితులను అదుపులోకి తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ ఘటనలో పూర్తిగా చేతులెత్తేసిన పోలీసుల ఏం సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారని నిలదీసింది. ఈ కేసులో నిందితులపై 302 సెక్షన్ మోపబడింది. ఇది హత్యకు సంబంధించిన సెక్షన్. ఈ సెక్షన్ పై నమోదయ్యే ఇతర కేసుల్లో వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తారో లఖింపూర్ కేసు నిందితులతోనూ అలాగే వ్యవహరించండి’ అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేసింది.

లఖీంపూర్ ఖేరీ ఘఠనలో రైతుల మరణానికి కారణమయ్యారని తీవ్ర అరోపణలను ఎదుర్కోంటున్న కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశీష్ మిశ్రాను తమ ఎదుట హాజరుకావాల్సిందిగా పోలీసులు గురువారం నోటీసులు అందించారు. అయితే ఇప్పటివరకు ఆయన పోలీసుల ఎదుట హాజరుకాలేదు. దీంతో పోలీసులు ఇవాళ మరోమారు ఆయనను తమ ఎదుట హాజరుకావాల్సిందిగా అదేశిస్తూ మరోమరు అజయ్ మిశ్రా ఇంటికి నోటీసులు అతికించారు. ఇక ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వ న్యాయవాధి హరీశ్ సాల్వే.. రేపు కూడా అశీష్ మిశ్రా పోలీసుల ఎదుట హాజరుకాని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వయ్ తొక్కుకుంటా వెళ్లడంతో నలుగురు రైతులు మరణించడంపై శివకుమార్ త్రిపాఠి అనే న్యాయవాది.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు రాసిన లేఖ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ ఘటనను సుమోటాగా తీసుకుని విచారణ చేపట్టింది. ఇక లఖీంపూర్ ఘటనపై చోటుచేసుకుంటున్న పరిణామాలపై సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళన వ్యక్తం చేసింది. ఆశిష్ మిశ్రా ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదని వెల్లడించింది. ఆశిష్ మిశ్రా, మరికొందరికి లఖింపూర్ నరమేధంలో భాగం ఉందని, వీరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles