Captured LeT terrorist Ali Babar exposes Pakistan army, ISI సజీవంగా పడ్డబడ్డ పాక్ ఉగ్రవాది.. కీలక విషయాలు వెల్లడి

Want to tell my mom indian army took care let teen who spills beans on pakistan

Captured Lashkar terrorist Ali Babar exposes Pakistan army, ISI, LeT terrorist Ali babar patra, Ali babar exposes ties of ISI and pakistan army, Pakistan terrorist, Indian Army, terrorist caught alive, terrorists infiltration, infiltration, Uri Sector, line of control, jammu and kashmir, Crime

A captured Lashkar terrorist has exposed the Pakistan army and the ISI on camera. The 19-year-old Ali Babar Patra, who was captured by the Indian Army in J&K's Uri during a failed infiltration bid, confessed he was trained and armed by Pakistan army officers.

సజీవంగా పడ్డబడ్డ పాక్ ఉగ్రవాది.. కీలక విషయాలు వెల్లడి

Posted: 09/30/2021 09:17 PM IST
Want to tell my mom indian army took care let teen who spills beans on pakistan

భారత భూబాగంలోకి చోరబడేందుకు అక్రమంగా వస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రయత్నాలను భారత సైన్యం మరోసారి భగ్నం చేసి.. ఓ ఉగ్రవాదిని ప్రాణాలతో సజీవంగా పడ్టుకున్న విషయం తెలిసింది. చాలా ఏళ్ల తరువాత ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎస్ బలగాలు పాకిస్థాన్ ఉగ్రవాదిని సజీవంగా అదుపులోకి తీసుకున్నాయి. భారత భూబాగంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుని విచారించింది. కాగా పాకిస్థాన్ తనకు ఎలా శిక్షణ ఇచ్చిందో.. అక్కడి ఐఎస్ తో పాకిస్థాన్ ఆర్మీకి ఉన్న సంబంధాలపై ఉగ్రవాది కీలక విషయాలను వెల్లడించాడు.  

ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థకు చెందిన లష్కేరే తోయిబా ఉగ్రవాది 19 ఏళ్ల అలి బబర్ పత్రా పాకిస్థాన్ దేశం భారత్ పై ఎలాంటి ఉగ్రకార్యకలాపాలు చేస్తుందో తెలిపాడు. తనకు పాకిస్థాన్ ఆర్మీ, లష్కరే తాయిబా ఉగ్రసంస్థలు శిక్షణ ఇచ్చాయని తెలిపాడు. బారాముల్లాలో ఒక ప్రాంతానికి ఆయుధాలను చేరవేసేందుకు రూ. 20 వేలు ఇచ్చారని చెప్పాడు. తమది పేద కుటుంబమని, తనకు తండ్రి లేడని, వస్త్ర పరిశ్రమలో పని చేసేవాడినని తెలిపాడు. ఆ సమయంలో ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఓ కుర్రాడితో తనకు పరిచయం ఏర్పడిందని... డబ్బుకు ఆశపడి అతనితో కలిసి లష్కరే తాయిబాలో చేరానని చెప్పాడు.

ముజఫరాబాద్ లోని లష్కరే క్యాంపులో శిక్షణ ఇచ్చారని... శిక్షణ సమయంలో తనకు రూ. 20 వేలు ఇచ్చారని, శిక్షణ తర్వాత రూ. 30 వేలు ఇస్తామన్నారని తెలిపాడు. శిక్షణ పూర్తయిన తర్వాత తనను పాక్ సైన్యం వద్దకు తీసుకెళ్లారని చెప్పాడు. వారి ఆదేశాల మేరకు తాను, మరి కొందరు భారత్ లో చొరబడేందుకు యత్నించామని తెలిపాడు. మరో వైపు ప్రస్తుతం కశ్మీర్ లోయలో 70 మంది వరకు పాక్ ఉగ్రవాదులు ఉండొచ్చని ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వీరు నేరుగా దాడుల్లో పాల్గొనకుండా.. స్థానికంగా ఉన్నవారిని రెచ్చగొట్టి, దాడుల్లో పాల్గొనేలా వ్యూహాలు అమలు చేస్తారని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles