Woman Opens Car Door and Finds Bear in Driver's Seat కారు డోర్ తీసి అరస్తూ పరిగెత్తిన యువతి..

Viral video woman opens car door and finds black bear in driver s seat

horiffic video of woman, horrifying clip of woman, unexpected visitor in car, unexpected visitor in drviing seat, bear in car, bear in car driving seat, security footage, black Lexus SUV, Internet, social media, viral video

When most people go home and park their car in their driveway, they’ll lock it for extra safety precautions so that no one can break in or steal anything. Usually not on the list of potential carjackers? Giant black bears. This was the case for one woman in a video that has since gone viral on Twitter who found an unlikely guest sitting in the driver’s seat upon walking up to the front door of her car.

ITEMVIDEOS: కారులో అనుకోని అతిథి: చూడగానే బిగ్గరగా అరస్తూ పరిగెత్తిన యువతి

Posted: 09/30/2021 06:13 PM IST
Viral video woman opens car door and finds black bear in driver s seat

ఈ మధ్యకాలంలో పట్టణాలు నగరాలు.. గ్రామాలు పట్టణాలు.. అడవులు గ్రామాలు అవుతున్నాయి. దీంతో అడవుల్లో ఉండే క్రూర, వన్యమృగాలు కూడా ఆహార అన్వేషణలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోకి వచ్చేస్తున్నాయి. జంతువులు రోడ్ల మీదకు..ఇళ్లలోకి ప్రవేశిస్తున్న ఘటనలతో మనిషి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జంతువులు ఎదురు పడగానే.. ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే భయపడినా, పరుగులు పెట్టినా అందుకు సబంధించిన వీడియోలు మాత్రం నెట్టింట్లో సంచలనం రేపుతున్నాయి,

తాజాగా.. తమ కారు డోర్ తెరిచి ఉండడంతో ఎవరు తీసారా.? అని చెంతకు చేరిన ఓ యువతి కారులో వున్న అనుకోని అతిథిని చూసి హఢలిపోయింది. తన పైప్రాణాలు పైనే పోయినట్టుగా భావించిన అమె ఏకంగా తన చేితిలో పళ్ల బుట్టను కూడి కిందపడేసి తన ఇంట్లోకి పరుగులు తీసింది. అనుకోని ఘటనతో అతిధి కూడా కాసింత కంగారు పడి కారులోంచి భయటకు పరుగున వచ్చి పరుగుతీశాడు. అయితే తేరుకుని మళ్లీ కారు వద్దకు చేరుకన్నాడు. ఇక ఈ వీడియో నెట్టింట్లో ఏకంగా యాభై లక్షల మందికి పైగా వీక్షించడతో వీపరీతంగా వైరల్ అయ్యింది.

ఇంతకీ ఆ కారులో ఉన్న అనుకోని అతిథి ఎవరో తెలుసా..? ఈ వివరాలు తెలియాలంటే మ్యాటర్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే. ఓ యువతి తన కుటుంబంతో సహా కారులో పిక్నిక్ వెళ్లాలని ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో కారులో కొన్ని వస్తువులను పెట్టింది. ఆపైన కారు డోర్ వేసి లాక్ చేయడంలో కాసింత అశ్రద్ద వహించారో ఏమో తెలియదు కానీ.. ఇక ఒక బాస్కెట్ నిండా ఆపిల్స్ ను పెట్టుకుని దానిని కూడా కారులో పెడదామని వచ్చింది. అంతే అమెకు కారు డోర్ తీసి ఉండటం కనిపించింది. ఎవరా.. కారులోకి ఎక్కిందీ అంటూ మెల్లిగా డోర్ ను పూర్తిగా తీసి చూసి హడలెత్తిపోయింది.

చటుక్కున ఓ అడుగు వెనక్కి దూకుతూ.. కారు డోర్ పెట్టాలని ప్రయత్నిం చేసింది. ఇంతలో కారులోని అనుకోని అతిధి కారు డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించాడు. అయినా యువతి తన బలాన్నంతా కూడగట్టుకుని కారు డోర్ వేసేందుకు ప్రయత్నించింది. కానీ అనుకోని అతిథి బలం ముందు ఆమె బలం నిలువలేదు. ఓ చేతిలో వున్న పండ్లబుట్ట సహా అమెలో ఓ కోణంలో వున్న భయం అమె ప్రయత్నాన్ని విజయవంతం చేయలేదు. ఇక తాను ఓడిపోయానని గ్రహించిన యువతి తన చేతిలో ఉన్న బుట్టను అక్కడే వదిలేసి ఇంట్లోకి పరుగులు తీసింది. అదే సమయంలో అనుకోని అతిధి కూడా జంకి కారులోంచి బయటకు వచ్చి పరుగు తీశాడు.

అయితే అనుకోని అతిధి కాసింత తేరుకుని మళ్లి వెనక్కు తిరిగి.. కారు వైపుకు నడిచాడు. ఎందుకనో తనను బయపెట్టిన కారులోకి వెళ్లకపోవడం మంచిదని అనుకున్నాడో ఏమో తిలియదు కానీ.. నేరుగా పండ్ల బుట్ట వద్దకు చేరుకుని అక్కడే నిల్చున్నాడు. ఇంతకీ అనుకోని అతిథి ఎవరని అనుకుంటున్నారు. మరెవరో కాదు ఎలుగుబంటి. ఈ నెలలో జరిగిన ఘటనను 19న ట్విట్టర్ లో పోస్టు చేయగా ఇప్పటి వరకు ఏకంగా 50 లక్షల  మంది దీనిని వీక్షించారు. అనేక రీట్వీట్లు, లైకుతో ఈ వీడియో నెట్టింట్లో బాగా సందడి చేస్తోంది. యువతి భయంతో పరుగులు పెట్టడంతో నెటిజనులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh