Old woman fights off leopard after attack at home దాడికి యత్నించిన చిరుత.. వాకింగ్ స్టిక్‌తో తరిమిన బామ్మ.!

Old woman fights off leopard with her walking stick in mumbai aarey colony

Woman attacked by leopard, woman fights off leopard, woman fights off leopard with walking stick, Aarey colony leopard attack, Mumbai middle aged woman, leopard attack, walking stick, Aarey colony, forest officials, Maharashtra, Crime, viral video, trending video

An old woman was seen fighting off a leopard with her walking stick in Mumbai's Aarey Milk colony. The leopard pounced on her from behind when she was sitting outside her house, also leaving her injured. The whole incident was captured on CCTV. She suffered scratch marks on her face, elbow, arm, back and leg

ITEMVIDEOS: దాడికి యత్నించిన చిరుత.. వాకింగ్ స్టిక్‌తో తరిమిన బామ్మ.!

Posted: 09/30/2021 04:56 PM IST
Old woman fights off leopard with her walking stick in mumbai aarey colony

చిరుత, పెద్దపులి, సింహం, ఇలాంటి క్రూరమృగాలనే కాదు ఏనుగు, ఎలుగుబంటి వంటి వన్య మృగాలను జంతు ప్రదర్శన శాలలకు వెళ్లి కాసింత దగ్గరగా చూడాలంటేనే ప్రాణాల్లో అరచేతిలో పెట్టుకుంటాం. అలాంటిది వాటికి ఎదురుపడ్డామా.? తప్పించుకునే తరుణోపాయం కోసం అలోచించేలోపే.. అవి దాడి చేసేస్తాయి. అయితే కొందరు మాత్రం తమ ధైర్య సాహసాలతో ఎంతటి క్రూరమృగాలనైనా ఎదురిస్తుంటారు. విజయమో.. విర స్వర్గమో అని తెల్చుకునేందుకు బరిలో దిగుతారు. క్రూర మృగాలైనా.. పలాయనం చిత్తగించాల్సిందే తప్ప వీరు మాత్రం ఓటమిని అంత సులువుగా అంగీకరించరు.

కొందరు మాత్రం వాటి బారి నుంచి బతుకు జీవుడా..అని బయటపడి ప్రాణాలు కాపాడుకుంటారు. ఇటీవల మహారాష్ట్రలో.. కుటుంబంతో సహా వస్తున్న వ్యక్తిపై  చిరుత దాడి చేయగా, దానితో పోరాడి చంపేసిన వీరుడి గురించి తెలుసుకున్నాం. ఇక ఆ తరువాత తన గొర్రెల మందపై దాడికి యత్నించిన చిరుతతో పోరాడిన ఓ పశువుల కాపరి గురించి తెలుసుకున్నాం. అయితే ఆకాశంలో సగం అంటున్న మహిళలు ఇలాంటి సాహసాలు చేయగలరా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కాగా, మధ్య వయస్సులోని మహిళ కూడా తన వాకింగ్ స్టిక్ తో చిరుతను కుక్కను తరిమినట్టుగా తరమడం చూస్తూ.. వావ్ అంటూ అమె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.

ముంబైలోని అరే కాలనీలో తమ ఇంటి అరుబయట కూర్చొన్న ఓ మహిళపైకి దాడి చేసేందుకు చిరుత యత్నించింది. వాకింగ్ స్టిక్ తో దానితో పోరాడింది. దీనికి సంబంధించిన విజువల్స్ సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో పోస్టు కావడంతో వైరల్ అయ్యాయి. ఆమె ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఆరే కాలనీలో సాయంకాల సమయంలో ఓ మధ్యవయస్సురాలైన మహిళ ఆరుబయట కూర్చొని ఉంది. అయిత నడవడానికి ఇబ్బందిపడే అమె తన వాకింగ్ స్టిక్ తో వచ్చి దానిని పక్కనే పెట్టుకుని ఉంది.

అలా వచ్చి కూర్చోందో లేదో అమె ఏదో అలోచిస్తోంది. అయితే ఈమె వెనుకాలే నక్కి అహారం కోసం వెతుకుతున్న చిరుతను ఆమె గమనించలేదు. దీంతో ఎలాంటి అలికిడి చేయకుండా మెల్లిమెల్లిగా ముందుకు నడుచుకుంటూ వచ్చిన చిరుత ఒక్కసారిగా ఆమెపై దాడికి పాల్పడింది. తొలుత ఏదో కుక్క అనుకున్న అమె చేయెత్తి కోట్టబోయింది. తీరా దానిని చూసిన తరువాత చిరుత అని గ్రహించగానే భయపడిపోయి..కేకలు వేసింది. దీంతో అమెపై పంజాతో విరుచుకుపడిన చిరుత అమెను కిందపడేసింది. దీంతో తన వాకింగ్ స్టిక్ ను అందుకున్న మహిళ.. చిరుతపై తన వాకింగ్ స్టిక్ తో తిరగబడింది. అంతే చిరుత ముఖంపై దెబ్బ తగలడంతోనే అది కాస్త వెనక్కు తగ్గింది.  

ఆమె కేకలు విని ఇంట్లో వున్న తన కొడుకులతో పాటు స్థానికులు రావడంతో చిరుత పారిపోయింది. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. అరునీల్ సాదదేకర్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. దాడిలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈమె 55 ఏళ్ల నిర్మలాదేవిగా గుర్తించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం..ఇంటి బయట ఆడుకుంటున్న…నాలుగేళ్ల చిన్నారిపై చిరుత దాడికి పాల్పడింది. బాలుడిని లాగడానికి ప్రయత్నించగా..స్థానికులు రావడంతో..చిరుత పారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles