Nigerian actor Chekwume Malvin arrested for drug peddling డ్రగ్స్ కేసులో సింగం నటుడు చెక్ వుమె మాల్విన్ అరెస్టు.!

Singham fame nigerian actor chekwume malvin nabbed in bengaluru for drug peddling

Bengaluru, Chekwume Malvin drugs, Chekwume Malvin bengaluru arrested, Chekwume Malvin arrest, Chekwume Malvin drug peddling, drug peddling, singham, vishwaroopam, Sandal wood, Singham, Bengaluru, Karnataka, Crime

A Nigerian actor who was part of Tamil blockbusters “Singham”, “Vishwaroopam” among many others including Bollywood flicks, has been arrested on charges of drug peddling in Bengaluru, police sources said. The police are now looking into his connections with the Sandalwood film industry here, besides in Mumbai, Chennai, Hyderabad and other cities.

డ్రగ్స్ కేసులో సింగం నటుడు చెక్ వుమె మాల్విన్ అరెస్టు.!

Posted: 09/30/2021 11:31 AM IST
Singham fame nigerian actor chekwume malvin nabbed in bengaluru for drug peddling

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంలో ఆయనకు ఆడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు కూడా వాటిని తిరిగి తీసుకోవడం.. అందినట్టే అందిన ఆరు సినిమాలు వెనక్కు వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన నటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడన్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ సినీపరిశ్రమలోని పలువురు అగ్రహీరోలు ఆయనకు సినీ అవకాశాలు దక్కకుండా చేశారని అరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన తన అరుదైన నటనతో పాత్రలలో ఇమిడిపోయి.. నటనకు కొత్త బాష్యం చెబుతున్నాడని.. దీంతో తమకు ఏదో ఒక్క రోజు అతను అవరోధంగా మారుతాడని భావించిన అగ్రహీరోలు ఈ చర్యలకు పాల్పడ్డారన్న అరోపణలు వినిపించాయి.

అయితే అతని మరణానికి మాదక ద్రవ్యాలకు లింక్ వుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సినీ అవకాశాలు చేజారిన నేపథ్యంలో మనోవేదనకు గురైన సుశాంత్ సింగ్ కు అతని గర్ల్ ఫ్రెండ్ మాదకద్రవ్యాలను అలవాటు చేసిందని వాటిని ఎక్కువగా తీసుకోవడంతోనే అతనిలో ఆత్మహత్య చేసుకోవాలన్న భావన కలిగిందని సిబిఐ అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సహా పలు చిత్రపరిశ్రమలను ఎన్సీబి, సిబిఐ, ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. అన్ని సినీ పరిశ్రమలకు సంబందించిన నటీనటులను టార్గెట్ చేసిన అధికారులు వారిలో అనుమాతులను ప్రశ్నించారు. వీరితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులను కూడా ప్రశ్నించారని సమాచారం.

మాదకద్రవ్యాల సప్లయిర్స్‌తో సినీనటుల వాట్సప్ ఛాటింగ్ ను బేస్ చేసుకొని ఎన్సీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. బాలీవుడ్‌తో పాటుగా మాలీవుడ్, శాండిల్ వుడ్, కోలీవుడ్‌, టాలీవుడ్‌ల‌లోను డ్ర‌గ్స్ కేసులో ప‌లువురు సినీ తార‌ల‌ని విచారించారు. ఈ క్రమంలో కొంద‌రిని అరెస్ట్ కూడా చేశారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్షన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సింగం’ చిత్రంలో మాద్రకద్రవ్యాల సరఫరా చేసే వ్యక్తిగా నటించిన చెక్ వుమె మాల్విన్ అనే నైజీరియన్ నిజజీవితంలోనే అదే తన వృత్తిగా ఎంచుకుని పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. నిందితుడి నుండి 15 గ్రాముల ఎండీఎంఏ,7 ల‌క్ష‌ల విలువైన 250 ml హాష్ ఆయిల్, మొబైల్ ఫోన్‌లు, 2,500 నగదు, ఇంకా 8 లక్షల విలువైన డ్రగ్స్ ను అతని దగ్గర నుంచి తీసుకుని సీజ్ చేశారు. ఇక అతనికి శాండిల్ వుడ్ తో పాటు ఇతర సినీపరిశ్రమలకు చెందిన లింకులపై పోలీసులు అరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chekwume malvin  drug peddling  singham  vishwaroopam  Sandal wood  Singham  Bengaluru  Karnataka  Crime  

Other Articles