Three day Heavy rain fall alert to telugu states తెలుగు రాష్ట్రాలలో దంచికోడుతున్న వర్షాలు.. మరో మూడురోజులు అంతే..!

Rain lashes two telugu states on sunday night to be continued for next three days

Heavy Rains, Weather update, Rains, Rains in Andhra Pradesh, Rains in Telangana, Rains in Hyderabad, Meteorological department, Telugu States, Torrential rains, Andhra Pradesh, Telangana

Heavy rains have been lashed out in Telangana and Andhra Pradesh with low-lying areas were inundated by the rains that fell overnight on sunday. Meanwhile, low pressure in the southwestern Bay of Bengal has been the cause of the rains. Also, another low-pressure area is likely to form near North Coastal Andhra next week.

తెలుగు రాష్ట్రాలలో దంచికోడుతున్న వర్షాలు.. మరో మూడురోజులు అంతే..!

Posted: 09/27/2021 10:14 AM IST
Rain lashes two telugu states on sunday night to be continued for next three days

గులాబ్‌ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న తీరం ధాటిన తుఫాను క్రమంగా అల్పపీడనంగా మారినా.. తుఫాను ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్‌ ఇటు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. కాగా, గులాబ్‌ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారింది. గడిచిన ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీనపడింది.

గులాబ్‌ ప్రభావంతో విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, గజపతినగరం, నెల్లిమర్ల మండలాల్లో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యింది. భోగాపురం మండలంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విశాఖలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. భారీవర్షానికి లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి విజయవాడలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇటు తెలంగాణలోనూ గులాబ్ తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప‌లు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుపాను ప్రభావంతో హైద‌రాబాద్‌, ఉమ్మడి మెదక్ జిల్లా, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఖమ్మం జిల్లాలో భారీగా వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాను ప్రభావంతో సోమవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌ వ్యాప్తంగా వర్షం కురుస్తున్నది.

హైద‌రాబాదు వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి, అమీర్‎పేట్, పంజాగుట్ట, ఎస్సార్‌ నగర్, కూకట్ ‎పల్లి, బంజారా హిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, ఖైరతాబాద్‌, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, అంబర్‌పేట్, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్‌, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌ న‌గ‌ర్‌ ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ప‌లు ప్రాంతాల్లో రోడ్లు జ‌లమ‌య‌మ‌య్యాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం చెప్పింది.

గులాబ్‌ తుఫాను రాష్ట్రంలో సోమవారం కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిస్థితిపై సమీక్షించారు. కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారిమళ్లించింది. విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 1912, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles