Kerala Agri Uni to popularise seedless watermelon గింజలు లేని పుచ్చ.. రైతుల ఇంట కాసుల పంట

Seedless watermelon varieties developed by kerala agri university becoming popular

Kerala Agriculture University, seedless watermelon, hybrid cultivars, Shonima, Swarna, polyhouse, Vellanikkara, Thrissur, State Horticulture Mission, commercial cultivation, precision farming, Pradeep Kumar T, Department of Vegetable Science, Kerala Agri University, Kerala

The seedless watermelon varieties developed by Kerala Agricultural University (KAU) is so good that it will compel you to start watermelon farming. These varieties are slowly becoming popular amongst farmers.

కేరళ అగ్రీ యూనివర్సిటీ వారి గింజలు లేని పుచ్చ.. రైతుల ఇంట కాసుల పంట

Posted: 09/25/2021 04:30 PM IST
Seedless watermelon varieties developed by kerala agri university becoming popular

పంటలు పండించే రైతు లాభాఫేక్ష కోసం కాకుండా నేలతల్లి బిడ్డగా పంటలను పండిస్తూనే వుంటాడు. అయితే అతనికి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్నే ఆశిస్తాడు తప్ప.. లాభాలు కోరుకోడు. అది రైతన్న గొప్పదనం. ఆ గొప్పదనాన్ని మెచ్చిన శాస్త్రవేత్తలు వారికి ప్రతిఫలం అందేలా పాటుపడుతున్నారు. అనునిత్యం ఏదో ఓ ప్రయోగాన్ని విజయం చేస్తూ సరికొత్త వంగడాలను, హైబ్రీడ్ రకాలను పండిస్తున్నారు. దీంతో రైతుల కడుపు నింపుతున్నారు. ఈ క్రమంలో వారు పండించిన పంటలు నాణ్యత, రుచి, ఫోషకాలు అన్ని సమపాళ్లో వుండేలా చూసుకుంటున్నారు.

అటువంటి పంటల్లో రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది ‘గింజలు లేని పుచ్చ పంట’. అదేంటి పుచ్చపండు అంటేనే గింజలు.. అలాంటిది గింజలు లేకుండా అంటే.. ఇక పిల్లలు ఎంచక్కా లోట్టలేసుకుని తినేస్తారు అంటారా. ఔను నిజమే. మరి ఈ తరహా పుచ్చపండును ఎవరు అభివృద్ది చేశారు అంటే..  కేరళ అగ్రికల్చర్ వర్శిటీ. కేరళలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం గింజలు లేని పుచ్చపండు హైబ్రీడ్ వంగడాలు రూపొందించింది. అయితే ఒక్కటి మాత్రమే కాదు ఏకంగా రెండు హైబ్రీడ్ వంగడాలను అభివృద్ది చేసింది.
వీటికి షోనిమా, స్వర్ణగా పేరుతో మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

కేరళలోని త్రిచూర్‌ ప్రాంతంలోని వెల్లినక్కర సమీపంలో కొత్తగా నిర్మించిన పాలిహౌస్‌లో కేరళ ఉద్యాన శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా సీడ్ లెస్‌ పుచ్చను సాగుచేసి అందరిని ఆకట్టుకుంటున్నారు. ఈ పుచ్చరకాన్ని పాలి హౌసులో మల్చింగ్, డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిన పెంచారు. బిందు సేద్యంతో యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఈ పంటను సాగు చేసి చక్కటి ఫలితాలను కూడా సాధించారు. ఆ తరువాత ఆ ఫలాలు రైతులకు దక్కేలా మార్కెట్ లో ప్రదర్శనలో పెట్టారు. ఈ గింజలు లేని పుచ్చ పంట గురించి అగ్రికల్చర్ సైంటిస్టు డాక్టర్‌ టి.ప్రదీప్‌ కుమార్‌ మాట్లాడుతు..గింజలు లేని పుచ్చ అనేది అసాధారణ హైబ్రీడ్‌ విత్తనం అని తెలిపారు. ఇది రైతులకు లాభాలను అందిస్తుందన్నారు.

ఈ సీడ్‌లెస్‌ పుచ్చ పంట సాగుకు ఎకరానికి రూ.50 వేల పెట్టుబడి పెట్టాలని.. అయితే ఎకరానికి రూ.1.2 లక్షల వరకు ఆదారం తెచ్చిపెడుతుంది. కేరళ అగ్రి వర్సిటీలోఒక్కో గింజను రూపాయి చొప్పున అమ్మకానికి పెట్టారు. కిలోకి 30వేల గింజలు వస్తాయన్నారు. ఈ గింజలు లేని పుచ్చ పంటపై త్రిచూరు జిల్లా రైతులు మంచి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే గింజలు కొని పంటలు వేశారు. చక్కటి లాభాలు పొందారు. సీడ్‌లెస్‌ పుచ్చ సాగు చేసి లక్షలు గడించినట్లు చెబుతున్నారు. తాము పండించిన పంటను వీడియోలు తీసి వాటిని పలు వెబ్‌సైట్లలో పెడుతున్నారు రైతులు. మీరు కూడా పండించి లాభాలు పొందండీ అని సూచిస్తున్నారు.కాగా ఈ పంట ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక వంటి ప్రాంతాల్లో ఎక్కువగా సాగయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు వ్యవసాయ నిపుణులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh