Rains in Telangana to continue till September 28 కోస్తా ప్రాంతానికి తుఫాను హెచ్చరిక... తెలంగాణకు వర్ష సూచన

Cyclone watch as bay of bengal erupts with activity overnight

IMD forecast, Air Balloon, Heavy rainfall, visakapatnam, depression in Bay of bengal, Rainfall in Andhra Pradesh, Rainfall in Telangana, Heavy Rain in AP, yanam, weather, skymet, Andhra Pradesh, Telangana, Weather forecast

Telangana will continue to receive light to heavy rains till September 28, before the southwest monsoon starts to officially withdraw from the state. The India Meteorological Department, Hyderabad (IMD) has extended heavy rain, thunderstorm and lightning and squall warning till September 28.

కోస్తా ప్రాంతానికి తుఫాను హెచ్చరిక... తెలంగాణకు వర్ష సూచన

Posted: 09/25/2021 03:08 PM IST
Cyclone watch as bay of bengal erupts with activity overnight

ఇప్పటికే రెండు తెలుగురాష్ట్రాల ప్రజలను వరుణుడు ఇబ్బందులకు గురిచేశాడు. జూలై నాటికే రెండు తెలుగు రాష్ట్రాలలోని వాగులు, వంకలు, పొంగిపోర్లగా, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో ఇక ఆగస్టు సహా ఈ నెలలో వరుణుడు భీభత్సమైన కరుణను ప్రజలు తట్టుకోలేకపోయారు, ఇదిలావుండా ఇక నైరుతి రుతుపవణాలు క్రమంగా వెనుదిరుగుతున్న క్రమంలోనూ వరుణుడు తెలుగురాష్ట్రాలపై ప్రతాపం చూపనున్నాడు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం క్రమంగా బలపడి తుఫానుగా మారనుందని భారత వాతావరణ కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది.

దీంతో కోస్తాంధ్రకు తుఫాను హెచ్చరికలను జారీ చేయడంతో పాటు తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయిన.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఇక బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గోపాల్‌పూర్‌కు 580, కళింగపట్నానికి  660 కీలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం మరో 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తీరం వైపు 14  కీలో మీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది.

వాయవ్యంగా కదులుతూ  ఆదివారం సాయంత్రానికి వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్షం ఉ‍న్నట్లు సూచించారు. తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం రాగల 12 గంటల్లో బలపడి తుఫానుగా మారనుందని భారత వాతావరణ కేంద్ర తెలిపింది. పశ్చిమ దిశగా పయనించి రేపు సాయంత్రానికి ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలోని గోపాల్ పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.

దీని ప్రభావంతో ఇవాళ కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం  ఉందని పేర్కొన్నారు. ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. ఆదివారం ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 70 -90 కీమీ వేగంతో బలమైన ఈదురుగాలులతో సముద్రం అలజడిగా మారుందనిమత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని తెలిపారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles