Bharat Bandh on 27 Sep, farmers' stir completes 300 days 300 రోజులకు రైతు నిరసనలు.. 27న భారత్ బంద్

Bharat bandh on 27 sep 2021 nearly 100 groups to join shutdown left congress tdp support

27 september 2021, bharat bandh, bharat bandh on 27 september 2021, bharat bandh 2021, bharat band, bharat band news, 27 september 2021 bharat bandh, bharat bandh 27 september, 27th september bharat bandh, september 27 bharat bandh, 27 september 2021 day, 27 september bharat bandh, bharat bandh 2021 september, 27 bharat bandh, bharath bandh, 27 sep 2021 bharat bandh, bharat bandh date 2021, bharat bandh date, bharat bandh 27 september 2021, bharat bandh in september 2021, monday bharat bandh, september 27 2021

In order to make the Bharat Bandh on 27 September 2021 successful, Left parties, Congress, and the Telugu Desam Party (TDP) got together at Andhra Pradesh's Communist Party India (CPI) office. Around 100 organisations, including national political parties, trade unions, farmers' associations, youth, teachers, labourers and others, will join the September 27 'Bharat Bandh'.

300 రోజులకు రైతు నిరసనలు.. భారత్ బంద్ కు విపక్షాలు మద్దతు

Posted: 09/23/2021 01:20 PM IST
Bharat bandh on 27 sep 2021 nearly 100 groups to join shutdown left congress tdp support

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, సహా దేశవ్యాప్తం రైతులు దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని సింఘ్రి, టిక్రీలలో గత ఏడాది డిసెంబర్ 26 నుంచి చేపట్టిన నిరసనలు మరో మైలురాయిని చేరుకున్నాయి. ఇవాళ్టితో రైతులు తలపెట్టిన నిరసన దీక్షలు ఏకంగా 300 రోజులను పూర్తిచేసుకున్నాయి. తమ ఏకైక డిమాండయిన నూతన సాగు చట్టాల బిల్లును కేంద్రం ఉపసంహరించుకునే వరకు తమ నిరసనలు కొనసాగుతూనే వుంటాయని ఈ సంరద్భంగా రైతులు తేల్చిచెప్పారు.

సంయుక్త కిస్సాన్ మోర్చాగా ఏర్పడిన 40 రైతు సంఘాలు.. ఒక్కతాటిపై నడుస్తూ.. ఏకైక డిమాండ్ ను కేంద్రప్రభుత్వం ముందు ఉంచాయి. కేంద్రం తాము రైతులతో చర్చలకు సిద్దం అంటూ ఒక్క మాటలను మళ్లి మళ్లీ వల్లిస్తున్నా.. నిజానికి రైతు సంఘాలతో చర్చలకు చోరవ చూపడం లేదని రైతు సంఘాలు అరోపిస్తున్నాయి. తమకు రైతులంటే ప్రమ వున్నట్లు నటిస్తున్న కేంద్రం.. నిజానికి రైతు వ్యతిరేక చర్యలకు పూనుకుంటుందని రైతు సంఘాల నేతలు అరోపించారు. ఏకంగా 300 రోజులుగా తాము నిరసన దీక్షలు చేపట్టినా ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు.

దేశవ్యాప్తంగా వున్న రైతులందరూ మద్దతను కూడగట్టుకుని తమ ఉద్యమం నానాటికీ మరింత బలపడుతోందని సంయుక్త కిసాన్ మోర్చ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. లక్షలాధి మంది రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నడుంచుట్టారని.. ఈ క్రమంలో సమయం గడిచిన కొద్దీ ఉద్యమం బలపడుతుందని ఆయన ప్రకటించారు. తమ శాంతియుత నిరసన దీక్షలు చేపట్టి తొమ్మిది నెలల కావస్తున్న తరుణంలో సెప్టెంబర్ 27న భారత్ బంద్ కు పిలుపునిచ్చామని తెలిపారు. ఈ బంద్ లో దేశవ్యాప్తంగా అన్ని విఫక్ష పార్టీలు పాల్గోంటున్నాయని తెలిపారు.

దేశవ్యాప్తంగా వున్న పలు సంఘాలు తాము తలపెట్టిన భారత్ బంద్ కార్యక్రమానికి మద్దలు ప్రకటించేందుకు సిద్దమయ్యాయని తెలిపారు. ఇప్పటికే పలు సంఘాలు తమకు మద్దు ప్రకటించాయని అన్నారు. రైతుల నిరసనలకు మద్దతుతో పాటు సంఘీభావం కూడా ప్రకటించాయని తెలిపారు. దీంతో రైతుల ఉద్యమం మరింత బలోపేతమై ఉధృతంగా మారుతుందని ఎస్కేయూ ముఖ్యనేతలు ప్రకటించారు. ఈ క్రమంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్ల కాన్ ఫెడరేషన్ కూడా బంద్ కు మద్దతు ప్రకటించింది. కేంద్రం తక్షణం రైతు సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేసింది. కాగా, ఇప్పటికే కార్మికసంఘాలు, వర్కర్ యూనియన్లు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు తమ భారత్ బంద్ కు మద్దతు ప్రకటించాయని అన్నారు.

ఇక భరత్ బంద్ నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ సీపీఐ భవనంలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్ బంధ్ను విజయవంతం చేయాలని సీపిఐ రాష్ట్ర నేత ధోణెపూడి శంకర్ ప్రజలను కోరారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. దేశంలోని రైల్వే స్టేషన్లను, రైల్వే లైన్లను, టెలికాం, ఆయల్, గ్యాస్, ఇన్సూరెన్స్, బ్యాంకులు, విమానాశ్రయాలు, పోర్టులను జాతీయ ధనీకరణ మిషన్లో భాగంగా విక్రయిస్తున్న కేంద్రం వ్యవసాయ రంగాన్ని కూడా కార్పోరేట్లకు తెగనమ్ముకోవాలని చూస్తోందని అందుకనే ఈ చట్టాలను తీసుకువచ్చిందని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles