SC allows Ganesha nimajjanam in Hussainsagar ‘last time’ హుస్సేన్ సాగ‌ర్‌లో గణేశ్ నిమ‌జ్జ‌నానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

Sc permits immersion of pop ganesh idols in hussain sagar lake as last chance

The Supreme Court on Thursday allowed the Telangana Government to permit the immersion of Plaster of Paris (POP) idols in Hussain Sagar lake during Ganesh Chaturthi celebrations only for this year as 'last chance'.

The Supreme Court on Thursday allowed the Telangana Government to permit the immersion of Plaster of Paris (POP) idols in Hussain Sagar lake during Ganesh Chaturthi celebrations only for this year as 'last chance'.

హుస్సేన్ సాగ‌ర్‌లో పీవోపీ విగ్ర‌హాల‌ నిమ‌జ్జ‌నానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

Posted: 09/16/2021 03:58 PM IST
Sc permits immersion of pop ganesh idols in hussain sagar lake as last chance

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. అనంత చతుర్ధశి రోజున ముగియనున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జరగనున్న గ‌ణేశ్‌ నిమ‌జ్జ‌నానికి మరో రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో దిక్కుతోచని ప్రభుత్వానికి ఊరటనిస్తూ సుప్రీంకోర్టు తాజా అదేశాలను జారీ చేసింది. గతంలోనే హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనాలు చేయరాదని అదేశించి.. తదనుగూణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని న్యాయస్థానాలు సూచించినా.. తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.

దీంతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలకు ఈ సారి ఎలాంటి పరిస్థితుల్లో అనుమతించేది లేదని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో గత్యంతర లేని పరిస్థితుల్లో దేశఅత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్రప్రభుత్వం.. ఈ ఒక్కసారి అనుమతి కల్పించాలని, వచ్చే ఏడాది తగు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటామని ప్రభుత్వం హామిఇవ్వడంతో సుప్రీంకోర్టు ఊరట కల్పిస్తూ తీర్పునిచ్చింద. ఈ ఒక్కసారి చివరి పర్యాయమని.. ఇకపై హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనాలు చేయరాదని.. అదేశించింది.

ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి ఈ ఏడాదికే మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు ప్ర‌క‌టించింది. కాగా, ప్రభుత్వం తీసుకునే కాలుష్య నియంత్రణ చర్యలతో పాటు కొద్ది స్థాయిలో మాత్రమే కాలుష్య ప్రభావం ఉండేట్లు చూసుకుంటామని పేర్కోంటూ అఫిడెవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం అదేశించింది. ఇక హైకోర్టు గతంతో జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తామని కూడా అఫిడెవిట్ లో పేర్కోనాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం అదేశించింది. ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్ర‌హాల‌ను హుస్సేన్ సాగ‌ర్‌లో నిమ‌జ్జ‌నం చేయ‌కూడ‌దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో గ‌ణేశ్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి రూట్ క్లియ‌ర్ అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles