తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు తనకు తానుగా శిక్షవిధించుకుని చనిపోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కీచకుడు రాజు తనకు తానుగా శిక్షను వేసుకున్నాడని అంటున్నారు, చిన్నారి కుటుంబానికి అండగా టాలీవుడ్ తారలు కూడా అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని, మంచు మనోజ్ సహా పలువురు కామాంధుడికి కఠిన శిక్ష్ విధించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా పాలకొండ రాజు పోలీసుల భయంతో ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చాలామంది అతడి మరణం పట్లు చిన్నారి కుటుంబానికి న్యాయ జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్‌లో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన రాజు అనే కిరాతకుడు తనకు తాను శిక్షను విధించుకోవడం బాధిత కుటుంబంతో పాటు మిగతా అందరికి కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయిని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజ చొరవ చూపాలని కోరారు.
ఈ తరహా కార్యక్రమాలు ఎవరు చేపట్టినా తన వంతు సహకారం అందిస్తానని చిరంజీవి అన్నారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి అని కోరుతూ ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను బదులిస్తూ సినీనటుడు మంచు మనోజ్ .. ‘ఈ వార్త చెప్పినందుకు థ్యాంక్యూ సర్.. దేవుడు ఉన్నాడు’ అంటూ మంచు మనోజ్ స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన చిన్నారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాడు.
సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్యతో చిన్నారి ఆత్మకు శాంతి చేకూరిందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. చిన్నారి ఆత్మగోశ రాజు మృతికి దారితీసిందని చెప్పారు. హత్యాచార ఘటనలు అత్యంత బాధాకరమని వెల్లడించారు. బాలికల్లో అవగాహన కోసం కార్యక్రమాలు చేపడతామన్నారు. కాగా పల్లకొండ రాజు పోలీసులను చూసి పారిపోతూ వేగంగా వెళ్తున్న కోణార్క్ ఎక్స ప్రెస్ రైలును పట్టాలపైకి ఎదురువెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా అతని రెండు చేతులపై మౌనిక అని పచ్చబోట్టు వుండటంతో దానిని చూసి గుర్తించిన పోలీసులు అతడ్ని సైదాబాద్ ఘటనలో నిందితుడని దృవీకరించుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Jul 02 | దేశంలో రాష్టప్రతి ఎన్నికలకు తెర లేచిన సందర్భంలో ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి కావని, రెండు సిద్దాంతాల మధ్య పోరుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కోన్నారు. దేశంలో నెలకొన్న ‘అసాధారణ... Read more
Jul 02 | భూమిపైన ఉన్న జంతుజాలంలో మనకు కనబడనవాటినే మనం గుర్తిస్తాం. కానీ మనకు తెలియని ఎన్నోరకాల జీవచరాలు భూమిపై ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇక మనకు తెలిసిన వాటిలోనూ ఎన్నో అరుదైన జీవులు వున్నాయని,... Read more
Jul 02 | రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా... Read more
Jul 02 | దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అత్యంత వేగంగా స్పందించిన పైలట్లు వెనువెంటనే తీసుకున్న చర్యలతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో పాటు క్యాబిన్... Read more
Jul 02 | దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల బలపర్చిన అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్... Read more