‘PM sent me money..’ ఖాతాలోని డబ్బు ఖర్చుపెట్టిన వ్యక్తిపై పోలీసు కేసు..!

Police filed case on man who spent rs 5 5 lakhs from his account

‘PM sent me money..’ Police case on Man who spent Rs 5.5 Lakhs, man held for spending Rs 5.5 lakhs, Ranjit Das, Bakhtiyarpur village, Mansi police station, police case, Rs 5.5 lakh, Gramin Bank, Khagaria, PM Modi, Bihar, Politics

A man in Bihar’s Khagaria district received Rs 5.5 lakh in his account by a bank error, but refused to return the amount, claiming the money “was sent by Prime Minister Narendra Modi”. The Gramin Bank in Khagaria had mistakenly sent the money to Ranjit Das, a native of Bakhtiyarpur village under Mansi police station

బ్యాంకు ఖాతాలోని డబ్బు ఖర్చుపెట్టిన వ్యక్తిపై పోలీసు కేసు..!

Posted: 09/15/2021 09:55 AM IST
Police filed case on man who spent rs 5 5 lakhs from his account

బ్యాంకులోని తన ఖాతాలో ఉన్న డబ్బులను ఖర్చుపెట్టుకున్న వ్యక్తిపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక ఆ వ్యక్తిపై ఏలాంటి కేసులు నమోదు చేయాలా.? అన్న విషయంలో మాత్రం వారు తర్జనభర్జన పడుతున్నారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన నోటీసులకు సకాలంలో సముచితంగా స్పందించలేదని అతినిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు న్యాయస్థానంలో నిలుస్తుందా అన్న అనుమానాలు కూడా పోలీసులలో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సదరు వ్యక్తి తన ఖాతాలోకి వచ్చినపడిన డబ్బులు మాత్రమే ఖర్చు చేశాడు, కానీ ఎవరి నుండి డబ్బులు రుణంగా తీసుకోలేదు. అలా అని అక్రమంగా సంపాదించి డబ్బును బ్యాంకులో జమ చేయలేదు.

అయితే పోలీసులు అతడిపై కేసు ఎందుకు నమోదు చేశారు. ఇక తన ఖాతాలోని డబ్బులు తానే ఖర్చు పెట్టే అధికారం ఖాతాదారులకు ఉందికదా.? మరి పోలీసులు ఎందుకు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే మ్యాటర్ లోకి ఎంటర్ కావాల్సిందే.. బ్యాంకు అధికారుల పొరపాటుతో ఒక వ్యక్తి ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. దీన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు సదరు వ్యక్తికి ఫోన్ చేసి ఆ డబ్బును తిరిగిచ్చేయాలని అడిగారు. అయితే ఆ సొమ్మును ప్రధాని మోదీ నుంచి వచ్చిందనుకొని ఖర్చు పెట్టేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు.  దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బిహార్‌లోని ఖగారియా ప్రాంతంలో జరిగింది.

స్థానికంగా ఉన్న గ్రామీణ బ్యాంకులో జరిగిన చిన్న పొరపాటుతో.. ఈ ఏడాది మార్చి నెలలో రంజిత్ దాస్ అనే వ్యక్తి ఖాతాలో రూ.5.5 లక్షల రూపాయలు జమయ్యాయి. తర్వాత తీరిగ్గా తమ పొరపాటును గుర్తించిన బ్యాంకు అధికారులు.. ఈ సొమ్మును తిరిగిచ్చేయాలని రంజిత్‌ను అడిగారు. ‘‘ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తారని వార్తలొచ్చాయి. నా ఖాతాలో పడిన డబ్బు దానిలో మొదటి విడత ఇన్‌స్టాల్‌మెంట్ అనుకున్నా. ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశా. ఇప్పుడునా దగ్గర డబ్బు లేదు’’ అని రంజిత్ చెప్పాడు. బ్యాంకు మేనేజర్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles