Remind cops to treat public with respect: High Court ప్రజలతో పోలీసులు గౌరవంగా మెలగాలి: హైకోర్టు

Kerala high court directs police not to use derogatory words to address citizens

Kerala High Court, Kerala police, Justice Devan Ramachandran, citizens, derogatory words, disrespect, directions, friendly police, Advocate Ansu Sara Mathew

The Kerala High Court has observed that though the then state police chief had issued a circular on November 30, 2018 asking cops to avoid disrespectful words while addressing the public, complaints on rude behaviour and improper words used by police are still reaching its doors.

అసభ్యపదజాలానికి స్థానం లేదు.. ప్రజలతో పోలీసులు గౌరవంగా మెలగాలి: హైకోర్టు

Posted: 09/11/2021 04:46 PM IST
Kerala high court directs police not to use derogatory words to address citizens

సాధారణంగా పోలీసులు స్టేషన్ కు వచ్చిన వాళ్లందరినీ నిందితులుగానే పరిగణిస్తారు.. అందరినీ అనుమానపు కన్నుతోనే కనిపెడుతుంటారు. అలాంటి ధోరణి వారికి స్వతహాగా రాదు.. కేసులు చేధించి.. వాటిని చేధించే క్రమంలో వెలుగుచూసే నిజాలను చూసిన అనుభవాలతో వారు అలా మారిపోతుంటారు. ఈ క్రమంలో ఎంతో మంది గోముఖవ్యాఘ్రాలను వారు చూసి.. వారికి అనవసరంగా ఇచ్చిన మర్యాద వారు నిలుపుకోలేక నిందితులని తేలడంతో వారు దురుసుగా వ్యవహరించటం.. ప్రజల్ని అగౌరవంగా మాట్లాడటం చూస్తుంటాం. వింటుంటాం. ఏంట్రా ఏంటీ గొడవ.. ఆడేడీ? ఏరా అంటూ మాట్లాడతారు.

మహిళలని కూడా చూడకుండా ఏంటే? ఏమే అని మాట్లాడిన ఘటనలు కూడా తెలిసినవే. అయితే కొందరు వారికిది అలవాటే అనుకుని సర్థుకుపోతుంటారు. అయితే కొందరు మాత్రం వాటిని తీసుకోలేకపోతారు. ఔను మేము ఇలానే వుంటామని పోలీసులు వుంటే మాత్రం ఇకపై కుదరదు. ఇక నుంచి ప్రజల్ని అమర్యాదగా మాట్లాడటానికి వీల్లేదని కేరళ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలతో పోలీసులు సవ్యమైన భాషలోనే మాట్లాడాలని.. ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించింది. దీంతో కేరళ డీజీపీ అనిల్ కాంత్ తాజాగా పోలీసులందరికి ఆదేశాలు జారీ చేశారు.

తమ దగ్గరకు వచ్చిన వారిని ఎడా (తెలుగురులో ఏరా)..`ఎడి`(తెలుగులో ఏమే) పోరా?ఏంట్రా, లాంటి అగౌరవ పదాలను ఉపయోగించవద్దని సూచించారు. పోలీసులు ప్రవర్తనను అనుక్షణం గమనించటానికి ప్రతి జిల్లాలో ఓ స్పెషల్ బ్రాంచ్ పనిచేస్తుందని తెలిపారు. ఈ ఆదేశాలు పాటించకుండా ఇష్టానుసారం ప్రవర్తించినా..ప్రజలతో అగౌరవంగా మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా..వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో తన కూతురితో పోలీసులు అసభ్యంగా మాట్లాడారని ఓ వ్యక్తి కేరళ హైకోర్టులో పిటీషన్ వేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ఆదే ప్రజలతో ఎలా అసభ్యంగా మాట్లాడతారని న్యాయస్థానం ప్రశ్నించింది.

గౌరవంగా మాట్లాడాల్సిన బాధ్యతను మరచి వ్యవహరించటం ఎంత వరకు న్యాయం?అని ప్రశ్నిస్తు కోర్టులో పిటీషన్ వేశారు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం..విచారణ చేపట్టింది.పోలీసులు ప్రజలతో సంభాషించేటపుడు గౌరవంగా వ్యవహరించాలని..మర్యాదగా మాట్లాడాలని ఆదేశించింది. `ప్రజలతో మాట్లాడేటపుడు గౌరవంగా వ్యవహరించడం పోలీసులు నేర్చుకోవాలి. `ఎడా`, `ఎడి` లాంటి పదాలతో ప్రజలను పిలిచే హక్కు పోలీసులకు లేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టంచేసింది. ‘ప్రజలతో పోలీసులు గౌరవంగా మాట్లాడాలని పోలీసులకు సూచిస్తు డీజీపీ ఆదేశాలు జారీ చేయాలి`అని కేరళ హైకోర్టు సూచించింది. దీంతో పోలీసులు ప్రజలతో మర్యాదగా మాట్లాడాలని డీజీపీ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles