Gulab Jamun injected with rum intrigues netizens ఈ గులాబ్ జామున్.. ఆడవాళ్లకు దూరం.. మగవాళ్లుకు ప్రాణం

Gulab jamun injected with old monk is a bizarre infusion desi foodies want to try

gulab jamun with rum, gulab jamun old monk, gulab jamun with old monk, old monk with gulab jamun, gulab jamun with rum, gulab jamun with old monk, gulab jamun old monk video, gulab jamun rum video, Rum, Old Monk, Gulab Jamun, Facebook, Rum Ball, Dessert, Alcohol, Kirak Adda, Viral Video, Video Viral

However, a recent video doing the rounds on social media has shown how gulab jamun can also become a discreet carrier of alcohol. A video shared on Facebook by Kirik Adda last month, demonstrated how one can inject Old Monk rum into gulab jamun and add a surprising twist to this Indian dessert.

ITEMVIDEOS: మత్తెక్కించే గులాబ్ జామున్.. మందుబాబులకు కొత్త రుచి..

Posted: 09/09/2021 04:06 PM IST
Gulab jamun injected with old monk is a bizarre infusion desi foodies want to try

గులాబ్ జామున్.. పేరు వినగానే నోరూరుతుంది కదా. నోట్లో వేసుకుంటే చాలు. దాని టేస్టే వేరు. గులాబ్ జామున్ అంటే ఇష్టం ఉండని వాళ్లు చాలా తక్కువ. గులాబ్ జామున్ ను చూసి నోటిని కంట్రోల్ చేసుకోవడం చాలామంది వల్ల కాదు. పిల్లలు కూడా లాగించేస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో.. ఫంక్షన్లలో గులాబ్ జామున్ ను ఐస్ క్రిమ్ లో కలుపుకుని మరీ ఆరగించేస్తారు బోజన ప్రియులు. అంతేకాదు టేస్ట్ అంటే రుచిగా వుండటం మాత్రమే కాదు.. కొత్త కొత్త మిక్సింగ్ లు చేయాలంటూ ఆలా అరగిస్తూ.. ఇలా సూక్తులు కూడా చెబుతుంటారు. వారి మాటలు విని అనేక మంది ఈ కాంబినేషన్ను లాగించేస్తున్నారు.

కానీ.. మందుబాబుల ఐడియాలు మాత్రం చాలా విచిత్రంగా వుంటాయి. వాళ్లను మందుకొట్టించవద్దని ఇంట్లో ఆంక్షలు పెడితే.. ఎలాగైనా మందుకొట్టాలని వారికి వచ్చే ఆలోచనలు చూస్తే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని అనుకుంటారు. కొన్ని ఐడియాలు మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి. అలాంటి అలోచనతోనే ఓ మందుబాబు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు మనం తెలుసుకునే గులాబ్ జామున్ చాలా డిఫరెంట్. మత్తెక్కిస్తుంది. దాన్ని నోట్లో వేసుకుంటే చాలు.. మత్తులో తూగాల్సిందే. ఈ గులాబ్ జామున్ అంటే మద్యం ప్రియులకు చాలా ఇష్టం.

ఎందుకంటే.. అది ఆల్కాహాల్ తో ఇంజెక్ట్ చేసిన గులాబ్ జామున్. కిరిక్ అడ్డా.. అనే ఓ ఫేస్ బుక్ అకౌంట్ లో రీసెంట్ గా ఈ వీడియో అప్ లోడ్ అయింది. అందులో.. గులాబ్ జామున్ లో ఓల్డ్ మంక్ రమ్ ను ఇంజెక్ట్ చేయడం చూడొచ్చు. అయినా.. మద్యాన్ని ఇలా తాగుతారా? మందుబాబుల ఐడియాకు హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. పైకి గులాబ్ జామున్ ల తింటూ.. హ్యాపీగా మద్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు. వాట్ ఆన్ ఐడియా సర్ జీ.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rum  Old Monk  Gulab Jamun  Facebook  Rum Ball  Dessert  Alcohol  Kirak Adda  Viral Video  Video Viral  

Other Articles