తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీ కృష్ణదేవరాయలు ఏ ముహూర్తాన అన్నారో తెలియదు కానీ దేశమందే కాదు యావత్ ప్రపంచమందు తెలుగు ప్రాముఖ్యత.. తెలుగు మాట కమ్మదనం.. తెలుగు పాట తీయదనం, తెలుగు పాట గోప్పతనం ఖండాలు దాటింది.. సప్తసముద్రాల ఆవల వున్న దేశాలలో తెలుగు పాట ప్రతిధ్వినిస్తోంది. ఔనా అంటారా.. లేక ఇదేదో మంచి బీట్, చక్కని సంగీతం ప్రభావమో కావచ్చు.. లేక పాట కట్టిన కవుల కలం ప్రభావమో అంటారా. అయితే కావచ్చునేమో కానీ.. ఏకంగా సిరివెన్నెల చిత్రంలోని పాటలు పాడటం అంటే కొంత కష్టమే.
ఈ పాటలను తన కలం నుంచి జాలువార్చి.. సిరివెన్నల చిత్రాన్నే తన ఇంటపేరుగా మార్చుకునేలా గుర్తింపును తెచ్చుకున్న సీతారామశాస్త్రీ.. తెలుగు ప్రేక్షకుల మనస్సులలో ఎప్పటికీ చెరగిపోని ముద్రవేసుకున్నారు. ఆ గేయాలు పాటడం అంటే మనవాళ్లే కాసింత గొంతు సవరించుకుంటారు. కానీ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ పాటలకు జీవాన్ని పోసారు. ఇలాంటి పాటలను శ్రావ్యానందంగా పాటడం కొందరికి దేవుడిచ్చిన వరం. అయితే ప్రాంతాలు, దేశాలు అందుకు అడ్డుకట్ట కాబోవని తాజాగా ఓ దుబాయ్ షేక్ నిరూపించారు.
1986లో వచ్చిన ‘సిరివెన్నెల’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని పాటలన్నీ ఆణిముత్యాలే. ఈ సినిమాకు పాటలు రాసిన సీతారామశాస్త్రి తన ఇంటి పేరునే ‘సిరివెన్నెల’గా మార్చుకున్నారు. ఇక ఇందులోని ‘విధాత తలపున’ అనే పాట అప్పట్లో ఎంత పాప్యులర్ అయిందో, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా అది ఇంటర్నెట్ను చుట్టేస్తోంది. కారణం.. ఓ దుబాయ్ షేక్ ఆ పాటను ఆలపించడమే. ఆ పాటను ఏమాత్రం పొల్లుపోకుండా, లయ తప్పకుండా ఆయన చక్కగా ఆలపించారు. టిక్‌టాక్‌లో ఆయన షేర్ చేసిన వీడియో ఇతర సామాజిక మాధ్యమాలకూ పాకేసింది. ఇది చూసిన తెలుగు సినీ ప్రియులు ‘ఔరా!’ అంటున్నారు. మీరూ వినండి మరి.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more