Ceiling Fan Falls Down During Family Dinner బోజనం చేస్తున్న కుటుంబంపై పడిన సీలింగ్ ఫ్యాన్.!

Horrifying moment as ceiling fan falls down on family during dinner

Ceiling Fan Surprises Family, Ceiling Fan Falls Down, Family Dinner, ceiling fan, family, dinner time, Bac Ninh, Vietnam, Viral video, YouTube viral video, ceiling fan falls, video viral, trending video

A family of six is seen squatting on the floor on a mat and relishing their dinner while talking to one another. Suddenly, the little child in their midst hears a noise and looks around. Seconds later, a ceiling fan drops right on the lap of the child and the two men seated beside him.

ITEMVIDEOS: హఠాత్పరిణామం: బోజనం చేస్తున్న కుటుంబంపై పడిన సీలింగ్ ఫ్యాన్.!

Posted: 08/25/2021 06:23 PM IST
Horrifying moment as ceiling fan falls down on family during dinner

ఒక కుటుంబం అంతా కలసి భోజనం చేస్తుండగా హఠాత్పరిణామాం చోటుచేసుకుంది. గాలి వీచేందుకువారు ఏర్పాటు చేసుకున్న సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఊడి పడింది. దాని కిందే కుటుంబం అంతాకలసి బోజనం చేస్తుండగా వారిపైనే పడింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వియత్నాంలో జరిగిన ఈ ఘనటకు సంబంధించిన వీడియోను వైరల్ హాగ్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ పోస్ట్‌ చేసింది.

ఒక కుటుంబంలోని ఆరుగురు నేలపై పరిచిన వస్త్రంపై కూర్చొని భోజనం చేస్తున్నారు. నలుగురు పిల్లలతో కలసి భార్యభర్తలు బోజనం చేస్తూ.. బోజనాన్ని అస్వాదిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఓ శబ్దం వినిపించింది. అయితే ఆ శబ్దం సీలింగ్ ఫ్యాన్ అని గ్రహించిన అందరూ.. అది అప్పుడప్పుడూ అలా చేయడంతో ఏ మాత్రం పట్టించుకోకుండా బోజనం చేస్తున్నారు. అయితే అందులో అందరికన్నా చిన్నారి మాత్రం శబ్దం వినిపించడం.. తరువాత అలికిడి కావడంతో అటు ఇటూ చూసి చివరగా తలఎత్తి పైకి సీలింగ్ ఫ్యాన్ వైపుకు చూశాడు. అంతే పైన తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌ కాస్తా ఉన్నట్టుండి ఆ ఫ్యాన్‌ ఊడి పడింది.

ఫ్యాన్ ను తదేకంగా చూసిన ఆ బాలుడుతో పాటు అతని తండ్రి, పెద్ద సోదరి మధ్యలో పడింది. వెంటనే లేచిన తల్లి ఆ బాలుడ్ని దగ్గరకు తీసుకుని ఏమైనా గాయమైందా అని పరిశీలించింది. మరోవైపు మిగతా వారంతా షాక్‌ అయ్యారు. ఈ ఏడాది జూలై 8న వియత్నాంలోని బాక్ నిన్హ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. వైరల్‌హాగ్ యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. దీనిని మిరాకిల్‌గా నెటిజన్లు పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ceiling fan  family  dinner time  Bac Ninh  Vietnam  viral video  trending video  

Other Articles