Laden believed Biden would 'lead US into crisis ‘‘బైడెన్ అధ్యక్షుడైతే.. అమెరికా సర్వనాశనం..’’

Osama bin laden warned in 2010 letter biden would lead us into crisis

Afghanistan, Joe Biden, Osama Bin Laden, withdrawal of US troops, Talibans, Al-Qaeda, US Military Academy, Barack Obama, US

OSAMA Bin Laden reportedly wanted Joe Biden to become President of the United States because he predicted the Democrat would mishandle things in Afghanistan and plunge America into a "crisis".

‘‘బైడెన్ అధ్యక్షుడైతే.. అమెరికా సర్వనాశనం’’: సంచలనం రేపుతున్న బిన్ లాడెన్ లేఖ

Posted: 08/24/2021 01:02 PM IST
Osama bin laden warned in 2010 letter biden would lead us into crisis

అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఒసామా బిన్ లాడెన్.. వ్యక్తులను వారి వ్యక్తిత్వాలను అంతగా చదివేశాడా.? అమెరీకన్లను మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదని వారంతట వారే సంక్షోభంలో కూరుకుపోతారని ఆయన ముందుగానే పసిగట్టారా.? జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఒసామా బిన్ లాడెన్ పదేళ్ల క్రితమే చెప్పాడా? ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి సేనలను ఉపసంహరించుకున్న తర్వాత బైడెన్ విషయంలో లాడెన్ చెప్పింది నిజం కాబోతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

2011లో అమెరికా బలగాలు లాడెన్‌ను మట్టుబెట్టిన తర్వాత అతడు రాసిన 48 పేజీల లేఖ లభ్యమైంది. మే 2010లో తన సోదరుడు అతియా అబ్దుల్ రహ్మాన్‌కు లాడెన్ ఈ లేఖ రాశాడు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, సీఐఏ డైరెక్టర్ డేవిడ్ పెట్రాస్‌ల విమానాలను లక్ష్యంగా చేసుకోవాలని అందులో సూచించిన లాడెన్.. బైడెన్‌ జోలికి వెళ్లొద్దని మాత్రం హెచ్చరించాడు. ఒబామాను చంపేస్తే బైడెన్ అధ్యక్షుడవుతాడని, ఆయన అధ్యక్షుడయ్యాడంటే మన కల నెరవేరినట్టేనని పేర్కొన్నాడు. అధ్యక్ష పదవికి బైడెన్ పూర్తిగా అసమర్థుడని, ఆయన  హయాంలో అమెరికా సంక్షోభంలో కూరుకుపోతుందని తెలిపాడు,

జో బైడన్ తోనే అమెరికా పతనం ప్రారంభమవుతుందని ఆ లేఖలో లాడెన్ పేర్కొన్నాడు. కాబట్టి బైడెన్‌కు ఎలాంటి హానీ తలపెట్టవద్దని 48 పేజీలున్న ఈ లేఖలో తన అనుచరులకు సూచించాడు. ఆ లేఖలోని 36వ పేజీలో రెండు హిట్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలన్న తన కోరికను లాడెన్ వెల్లడించాడు. అందులో ఒకటి పాకిస్థాన్‌లో, మరోటి ఆఫ్ఘనిస్థాన్ లో ఏర్పాటు చేయాలన్నాడు. ఈ రెండూ ఒబామా, సీఐఏ డైరెక్టర్ ల హత్యకు పథక రచన చేయాలని కోరాడు. 2012లో తొలిసారి ఈ లేఖ వెలుగులోకి రాగా, ఇప్పుడు ఆఫ్ఘన్ సంక్షోభం నేపథ్యంలో మరోమారు వెలుగులోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles