Mumbai: High profile prostitution racket busted in Juhu సెక్స్ రాకెట్ గుట్టు రట్టుచేసిన పోలీసులు.. మోడల్ అరెస్టు

Mumbai high profile prostitution racket busted in juhu

Isha Khan, Model, Actress, TV actress, Model, High Profile sex Racket, Prostitution, Bandra, Five star Hotel, Juhu, Mumbai, crime

Mumbai Crime Branch busted a high profile prostitution racket at a three star hotel in Juhu and arrested a 32-year-old model, Isha Khan, for allegedly operating the racket. During the raid, a TV serial actress and a model were rescued.

సెక్స్ రాకెట్ గుట్టు రట్టుచేసిన పోలీసులు.. మోడల్ అరెస్టు

Posted: 08/21/2021 11:45 AM IST
Mumbai high profile prostitution racket busted in juhu

సినీ పరిశ్రమలను ఓ వైపు పోర్నోగ్రఫీ, మరోవైపు హ‌నీ ట్రాప్ వ్య‌వ‌హారాలు కుదిపేస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్ర ఫోర్నోగ్రఫీ వీడియోలు తీసేందుకు, సినీ పరిశ్రమపై అనేకానేక ఆశలు పెట్టుకుని వచ్చిన ఔత్సాహికులను ట్రాప్ చేసి.. వారితో బలవంతంగా ఫోర్న్ సహా అర్థనగ్న చిత్రాలను షూట్ చేశారని, అందుకు మరో నటి గెహనా వశిష్ట్ కూడా సహకరించారని ఇప్పటికే దుమారం రేపుతుంది. ఈ వ్యవహారంలో రాజ్‌కుంద్రా సహా గెహనా వశిష్ట్ కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యింది. ఆ తరువాత వారు ఫోర్నోగ్రఫీ కోసం వారు చేసిన బాగోతాలు ఒక్కోక్కటిగా మెల్ల‌మెల్ల‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన విషయం తెలిసిందే.

ఇదే కాదు తాజాగా హ‌నీ ట్రాప్ వ్య‌వ‌హారం కూడా బాలీవుడ్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సైబ‌ర్ నేర‌గాళ్లు వంద మంది సెల‌బ్రిటీల న‌గ్న వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్‌కి దిగిన విషయం కూడా దుమారం రేపుతుంది. సెలబ్రెటీల ఫిర్యాదులతో ముంబై సైబర్ క్రైమ్‌ పోలీసులు ఓ ముఠాను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోల్లో బాలీవుడ్‌కు చెందిన 100 మంది సినీ, టీవీ నటులు ఉన్నారు. ఈ వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది. వీటితోనే బాలీవుడ్ పరిశ్రమ సెలబ్రిటీలపై సామాన్య ప్రజల్లో వున్న ఆదరణ సన్నగిల్లుతున్న క్రమంలో తాజాగా మరో మోడల్ చేసిన పని కూడా కలకలం రేపుతోంది.

ముంబైలోని జూహులో హైఫ్రోఫైల్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మోడల్ నిర్వాకాన్ని అక్కడి క్రైం బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. ఇషాఖాన్ అనే మోడ‌ల్, న‌టి ముంబైలోని బాంద్రా ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో సెక్స్ రాకెట్ న‌డుపుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పోలీసులకు ఈ సెక్స్ రాకెట్ గురించి సమాచారం అందడంతో.. వారే రంగంలోకి దిగి ఆమెను రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఈ హోటల్ లోకి వెళ్లిన ఓ పోలీసు అధికారి డమ్మి కస్టమర్ అవతారం ఎత్తారు. దీంతో అతను ఇషా ఖాన్ ను వ్యభిచారుల విషయమై ఫోన్ ద్వారా సంప్రదించారు. అయితే అందుకు అమె ఏకంగా నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేసింది.

పలుమార్లు ఫోన్ లో సంబాషనల తరువాత ఇషాఖాన్ కస్టమర్ అవతారమెత్తిన పోలీసు అధికారిని జూహులోని త్రి స్టార్ హోటల్ కు పిలిచారు. ప‌థ‌కం ప్ర‌కారం హోటల్‌కు వెళ్లిన పోలీసులు సదరు మోడల్‌తో పాటు మరో మోడల్, ఇంకో టీవీ నటి కూడా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో ఈ వృత్తిలోకి దిగినట్లు చెప్పారు. ఇషాఖాన్ పై పోలీసులు సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి మరోఇద్దరి అమ్మాయిలను పునరావస కేంద్రాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Isha Khan  Model  Actress  TV actress  Model  High Profile sex Racket  Prostitution  Bandra  Five star Hotel  Juhu  Mumbai  crime  

Other Articles