'Come Let's fight in Huzurabad' Eatela challenges KCR, Harish దమ్ముంటే.. నాతో మీరే తలపడండీ: కేసీఆర్, హరీష్ లకు ఈటెల సవాల్

Come let s fight in huzurabad bjp leader eatela rajender challenges cm kcr

Padi Kaushik Reddy, CM KCR, Padi Kaushik reddy nominated MLC, Governor quota, By-Elections, Huzurabad, Padi Kaushik Reddy Madannapet Vijender, Padi Kaushik Reddy Audio call viral, Huzurabad By-elections, Etela Rajender By-Elections, Huzurabad, TPCC secretary, KoushikReddy, Phone Call viral, Congress, Audio viral, Etela Rajender, CM KCR, TRS, KTR, Gangula Kamalakar, Harish Rao, Telangana, Politics

Political heat flared up in Telangana in wake of ensuing the Huzurabad by-elections. Addressing a meeting, BJP leader Eatala Rajender dared Telangana CM KCR and Minister Harish Rao to contest in the elections and win against him. He added that he has full support from the Huzurabad people and will win the elections even TRS party distributed Rs 10,000 per vote and announce Dalit Bandhu.

దమ్ముంటే.. నాతో మీరే తలపడండీ: కేసీఆర్, హరీష్ లకు ఈటెల సవాల్

Posted: 08/09/2021 11:29 AM IST
Come let s fight in huzurabad bjp leader eatela rajender challenges cm kcr

మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీళ్లు, నియామకాలు, నిధుల కోసం జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తరువాత.. గత ఏడేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ ప్రముఖుల చేతిలోనే అవి బంధించబడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న సీఎం కేసీఆర్.. మాయమాటలు చెబుతూ ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగలకు భృతి కల్పిస్తానని రెండేళ్ల క్రితం చేసిన వాగ్ధనం ఏమైందని ఆయన ప్రశ్నించారు.

తనను ఎలాగైనా ఒడించాలని పంతం పట్టి మంత్రుల దండుతో పాటు ఎమ్మెల్యేలను కూడా పంపి.. హుజూరాబాద్ లో ఓ రకమైన ఎమర్జెన్సీ వాతావరణాన్ని తీసుకోచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావుకు దమ్ము, ధైర్యం వుంటే.. వారిని  వీరిని ఎంచుకోవడం ఎందుకు.. నేరుగా వారే తనతో తలపడవచ్చునని సవాల్ విసిరారు. ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించడం ఎంతవరకు సమంజసమని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు. ఉధ్యమంలో తన వెంట ఉన్నవారిని ఇప్పడు బయటకు తోసి.. బయట ఉన్నవారిని ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏడేళ్లలో సీఎం ఆఫీస్ లో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారి నియామకం జరగలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ కూడా అములు కాలేదని చెప్పారు. దళితుల జీవితాల్లో వెలుగు నింపలేదని విమర్శించారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి కాదు ఇచ్చిన ఉపముఖ్యమంత్రి పదవిని కూడా మున్నాళ్ల ముచ్చటే చేశాడని విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ.3116 భృతి ఇస్తామన్న వాగ్ధానాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. దళితబంధు పథకాన్ని యావత్తు తెలంగాణకు వర్తింపజేయాలని అన్నారు.

తనను బక్కపల్చని పిల్లగాడు, దిక్కులేని పిల్లగాడు అని అంటున్నారని, కానీ హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నానని అన్నారు. ఓటుకు రూ. 10 వేలు ఇచ్చినా సరే ప్రజల గుండెల్లోంచి తనను తుడిచేయలేరని స్పష్టం చేశారు. ఉరుములు వచ్చినా, పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరని ఈటల ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని, అయినా ఫర్వాలేదని, ఎన్నికల్లో చూసుకుందామని అన్నారు. ముఖ్యమంత్రి మాటల్లో, చేతల్లో నిజాయతీ లేదన్న ఈటల.. న్యాయబద్ధంగా పోటీ చేస్తే వారికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. తాను మచ్చలేని వ్యక్తినని, కక్ష గట్టి తనను తప్పించారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Padi Kaushik reddy  MLC  By-Elections  Huzurabad  Etela Rajender  Telangana  Politics  

Other Articles

Today on Telugu Wishesh