woman constable attacked in hardoi Police station ఠాణాలో మహిళా హెడ్ కానిస్టేబుల్ కేకలు.. ఏం జరిగిందంటే..

Up woman attacked on female police constable in hardoi police station

woman head constable, woman constable beaten in police station, woman head constable beaten by UP woman, woman head constable beaten by Hardoi woman, woman head constable beaten by kotwal woman, Hardoi, head constable, shilu, Nidhi, dwivedi, female police constable, up police, Hardoi News,uttar pradesh, crime

A young woman assaulted a female constable posted in the city Kotwali. The female constable was injured due to the beating of the girl. Hearing the noise, many constables on duty came running after which the lady constable could be saved.

ఠాణాలో మహిళా హెడ్ కానిస్టేబుల్ కేకలు.. అరుపులు.. ఏం జరిగిందంటే..

Posted: 08/05/2021 09:35 PM IST
Up woman attacked on female police constable in hardoi police station

ఉత్తర్ ప్రదేశ్ లోని కోత్వాలి పోలిస్ స్టేషన్ లో ఓ వింత ఘటన జరిగింది. స్టేషన్ లోనే అందరూ సిబ్బంది వుండగా ఓ యువతి ఏకంగా మహాళా పోలీసు కానిస్టేబుల్ పైనే దాడి చేసింది. యువతి దెబ్బలకు మహిళా హెడ్ కానిస్టేబుల్ పెట్టిన కేకలు, అరుపులతో స్టేషన్ లోని మిగతా పోలీసులు పరుగుపరుగున వచ్చి అమెను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వినటానికి విడ్డూరంగా ఉన్నా నిజం. పోలీస్ స్టేషన్ లోంచి ఓ ఆడగొంతు కేకలు విని ఉలిక్కిపడ్డ స్థానికులు.. కేకలు పెట్టింగి హెడ్ కానిస్టేబుల్ కాగా, కోట్టింది మాత్రం ఓ సాధారణ యువతి అని తెలుసుకుని షాక్ అయ్యారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని కొత్వాలి జిల్లాలోని హర్దోయీ పట్టణం పోలిస్ స్టేషన్ జరిగిన ఈ ఘటన అసలు వివరాల్లోకి వెళ్తే.. ..కాన్హా ద్వివేది అనే యువకుడు ఓ పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. విచారణ కోసం పోలీసులు ద్వివేదిని పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో ఓ యువతి ఆ పోలిస్ స్టేషన్ కు వచ్చింది. ఆమె ద్వివేది సోదరి నిధి. మధ్యాహ్నం 12గంటల సమయంలో నిథి స్టేషన్ లోకి ఎంట్రీ ఇవ్వటమే తిట్లతో దూసుకొచ్చింది. రావడం రావడమే పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టిపోయడం మొదలుపెట్టింది.

అదే సమయంలో స్టేషన్ డ్యూటీలో ఉన్న శీలూ అనే మహిళా కానిస్టేబుల్ ..పోలీసులను నోటికొచ్చినట్లుగా పచ్చిబూతులు తిడుతున్న నిధిని అడ్డుకుంది. ఏంటా తిట్లు నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడతావా? నువ్వు ఎవరు? ఎందుకొచ్చావు? ముందు చెప్పు అంటూ ప్రశ్నించింది. అంతే నిధి కోపం కట్టలు తెంచుకుంది. ఇతను నా సోదరుడి ద్వివేది. అతన్ని ఎందుకు పిలిపించారు స్టేషన్ కు అంటూ హెడ్ కానిస్టేబలు శీలూపై విరుచుకుపడింది. దానికి శీలూ ఏదో చెప్పబోయింది.

అక్కడితో ఆగకుండా పోలీసు అని కూడా చూడకుండా లెక్కచేయకుండా హెడ్ కానిస్టేబుల్ శీలూపైకి దూకి ఇష్టమొచ్చినట్లుగా కొట్టడం మొదలుపెట్టింది. ఏకంగా కానిస్టేబుల్ చెయ్యి మెలితిప్పి కొట్టడంతో.. శీలూ చేతిలోని ఘన్ కూడా కింద పడిపోయింది. నిధి నుంచి తప్పించుకోవటం ఆమె వల్ల కాలేదు. దాంతో శీలూ పెద్దగా అరిచి కేకలు పెట్టడంతో పోలీసు స్టేషన్‌లోని మరికొందరు కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని శీలూను కాపాడారు. ఆ తరువాత పోలిస్ స్టేషన్ కొచ్చి పోలీసునే కొడతావా? అంటూ నిధి మీద కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardoi  head constable  shilu  Nidhi  dwivedi  female police constable  up police  Hardoi News  uttar pradesh  crime  

Other Articles