China's Nanjing sealed off as Delta variant spreads చైనాలో డెల్టా కలకలం.. నాన్జింగ్‌ నగరం.. అష్టదిగ్భంధనం

China s nanjing with 9mn people sealed off as delta variant of covid spreads

Nanjing, China, COVID-19, Nanjing sealed, Nanjing Delta variant, covid-19, covid, Antibodies, COVID-19 Vaccines, Coronavirus, nanjing covid19, nanjing delta, china delta cases, china covid19, Corona Vaccine

The city of Nanjing in eastern China has been virtually sealed off and residents advised to stay indoors after 31 new Covid-19 cases were reported on Tuesday in the past 24 hours, pushing the total number of coronavirus infections up to 112 in the ongoing outbreak.

చైనాలో డెల్టా కలకలం.. నాన్జింగ్‌ నగరం.. అష్టదిగ్భంధనం

Posted: 07/29/2021 08:54 PM IST
China s nanjing with 9mn people sealed off as delta variant of covid spreads

కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో మరోసారి కరోనా కలకలం రేగింది, ఇన్నాళ్లు కరోనా వెంటాడినా పెద్దగా చడీచప్పుడు కానీకుండా సర్థిపెట్టేసుకున్న డ్రాగన్.. ఇప్పుడు మాత్రం తమ సృష్టించిన గుడ్డే పిల్లగా మారి రావడంతో కలవరం చెందుతోంది. ప్రస్తుతం చైనాలో డెల్టా వేరియంట్‌ కలకలం రేపుతున్నది. డెల్టా వేరియంట్ కరోనామహమ్మారి విజృంభణతో చైనాలోని అరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా బాధితులను క్వారంటైన్ కు తరలించి చికిత్సను అందిస్తున్నారు.

తూర్పు చైనా నగరమైన నాన్జింగ్‌ విమానాశ్రయంలో 9 మంది క్లీనర్ల నుంచి మొదలైన కరోనా వ్యాప్తి తీవ్రత మరింతగా పెరుగుతున్నది. కరోనా ఉనికిలోకి వచ్చిన అనంతరం తిరిగి సాధారణ స్థితికి చేరిన చైనాలో తాజాగా డెల్టా వేరియంట్‌ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది. మాస్‌ టెస్టింగ్‌, క్వారంటైన్‌ నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ గత కొన్ని రోజులుగా డజన్ల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతోపాటు మరిన్ని ప్రాంతాలకు వైరస్‌ వేరియంట్‌ వ్యాపిస్తున్నది.

బీజింగ్‌లో ఆరు నెలల తర్వాత తొలిసారి గురువారం స్థానికంగా వ్యాప్తి చెందిన కరోనా కేసు నమోదైంది. ఇటీవల నాన్జింగ్‌ కు వెళ్లిన వారి నుంచి కరోనా వ్యాపించినట్లు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. దీంతో గురువారం నాటికి చైనాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 200కు చేరింది. కరోనా నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకున్న కొవిడ్‌ జీరో ప్రాంతాలకు కొత్త వేరియంట్‌ వ్యాపించడంపై ఆ దేశ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh