Chhattisgarh: Maoist killed in encounter in Bijapur district ఛత్తీస్ గడ్ లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

It raida ysrcp rajya sabha mp alla ayodha rami reddy s properties in hyderabad

Raipur, Mithilesh Kumar, maoists, Maoist attack in bajipur, Central Reserve Police Force, Bijapur, Chhattisgarh, Crime

Three Maoists was killed in a fierce encounter between Maoists and security personnel in forests of insurgency-hit Bijapur district of Bastar division on Tuesday. Police claim that there were three or four Maoists killed in the encounter but body of only one was recovered. A CRPF personnel has also sustained bullet injuries in the incident.

ఛత్తీస్ గడ్ లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Posted: 07/13/2021 08:48 PM IST
It raida ysrcp rajya sabha mp alla ayodha rami reddy s properties in hyderabad

మావోయిస్టులకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. పోలీసు బలగాలతో తలపడి ముగ్గురు మావోలు మరణించారు. ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూంబింగ్ చేస్తున్న పోలీసులను చూపి మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న పోలీసులు, యాంటీ మావోయిస్టు స్వాడ్ బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ముగ్గరు మావోయిస్టలు మరణించారు. ఈ మేరకు బీజాపూర్ పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, యాంటి నక్సల్ స్వాడ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఉసూర్-గల్గాం గ్రామాల మధ్యలోకి పోలీసులు బలగాలు ప్రవేశించడాన్ని గమనించిన మావోలు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. అయితే అప్పటికే ఓ జవానుకి తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడించారు.

ఇక పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, గాయపడిన జవాన్‌ అఖిలేష్ ను బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు. కాగా మావోల ఏరివేతలో భాగంగా పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే జార్ఖండ్ లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. ఈ ఘటనలో 203 బెటాలియన్ కు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్, పోలీస్ జాగిలం (కుక్క) మృతి చెందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles