Nearly naked man sets fire to cross atop a church లోదుస్తులతో చర్చిపైకి ఎక్కి.. శిలువకు నిప్పుపెట్టి..

Man lights church cross on fire jumps from rooftop to rooftop in attempt to evade police

Man sets church cross fire, Jumps roof, Man church cross jump roof, Man Los Angeles church cross, Man jumps roofs Los Angeles, Man, Church cross, Fire, Jump roof, Los Angeles, United states, America, Crime

n a shocking incident, a nearly naked man was arrested from a neighbourhood in Los Angeles after he climbed atop a church bell tower, set fire to a cross, and then proceeded to jump rooftops and rappel down buildings. The entire incident was caught on camera by a news crew and broadcast live.

ITEMVIDEOS: లోదుస్తులతో చర్చిపైకి ఎక్కి.. శిలువకు నిప్పుపెట్టి..

Posted: 07/13/2021 04:56 PM IST
Man lights church cross on fire jumps from rooftop to rooftop in attempt to evade police

శాడిస్టులకు, సైకోలకు ప్రపంచంలో కొదవేం లేదు. అది అమెరికా అయినా లేక మరే దేశమైనా.. ఒక్కో దేశంలో వీరు సృష్టించే విపరీతాలు ఒక్కో రకంగా వుంటాయంతే. కానీ ప్రపంచం మొత్తం మీద సైకోలు, శాడిస్టులు చేసే పని మాత్రం అదే. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఓ శాడిస్టు చేసిన పని స్థానికులను షాకింగ్ కు గురిచేసింది. వంటిపై కట్ డాయర్ తప్ప ఏమీ లేని ఓ శాడిస్టు.. నాలుగు అంతస్థులున్న ఓ చ‌ర్చిపైకి ఎక్కి.. ఆ చ‌ర్చి శిఖ‌రం మీద ఉన్న శిలువ‌కు నిప్పుపెట్టాడు. ఇదేమి శుక్కానందమో తెలియదు కానీ.. ఆ తరువాత ఒక బిల్డింగ్ మీద నుంచి మ‌రో బిల్డింగ్ మీద‌కు దూకుతూ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అనేక పాట్లు పడ్డాడు.

కానీ పోలీసులు సదరు శాడిస్టును పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. చర్చి శిలువకు నిప్పు పెట్టేడానికి గల కారణాలు ఏంటన్న విషయమై వారు విచారిస్తున్నారు. పిల్లి పాలు తాగినట్టుగా ఈ శాడిస్టు కూడా తనను ఎవరూ చూడటం లేదని భావించాడు.. కానీ ఈ త‌తంగం అంతా లాస్ ఏంజెలిస్‌కే చెందిన‌ ఫాక్స్‌-11 అనే మీడియా సంస్థ కెమెరాకు చిక్కింది. ఫాక్స్‌-11 సిబ్బంది హెలిక్యాప్ట‌ర్ పై నుంచి న‌గ‌రానికి సంబంధించిన వీడియోలు తీసుకుంటుండ‌గా.. అందులో ఆ న‌గ్న వ్య‌క్తి బాగోతం కూడా రికార్డ‌య్యింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. లాస్ ఏంజెలిస్ లోని బోయిల్ హైట్ ఏరియాలో సెయింట్ మేరీ క్యాథ‌లిక్ చర్చి ఉన్న‌ది. నాలుగంత‌స్తులు ఉన్న ఈ చ‌ర్చి శిఖ‌రంపైకి ఓ వ్య‌క్తి కేవ‌లం ఒంటిపై డ్రాయ‌ర్ తో (దాదాపు న‌గ్నంగా) ఎక్కాడు. అనంత‌రం దానిపై ఉన్న ఏసుక్రీస్తు శిలువ‌కు నిప్ప‌టించాడు. ఆ త‌ర్వాత ఒక భ‌వ‌నం మీద నుంచి మ‌రో భ‌వ‌నం మీద‌కు దూకుతూ పారిపోయాడు. అయితే, మంట‌లు చ‌ర్చిలోప‌లికి వ్యాపించ‌క‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పివేశారు. అంత‌కుముందే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ స‌మ‌యంలో నిందితుడి ఒంటిపై లీ డ్రాయ‌ర్ త‌ప్ప ఏమీ లేద‌ని పోలీసులు చెప్పారు. ఘ‌ట‌న‌కు సంబంధించి అత‌డిని ఇంటరాగేట్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కాగా, ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నిందితుడు ఒక బిల్డింగ్ మీద నుంచి మ‌రో బిల్డింగ్ మీద‌కు దూకుతున్న దృశ్యాల‌ను చూసి నెటిజ‌న్‌లు ఎంజాయ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Man  Church cross  Fire  Jump roof  Los Angeles  United states  America  Crime  

Other Articles