యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో దీని మూలాలు కనుగొన్నారు. అసలు నిందితుడైన కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. యూట్యూబ్ లో చూసి దొంగ నోట్లను తయారు చేశానని అతడు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. అంతేకాదు ఆ డబ్బుతోనే వడ్డీ వ్యాపారం చేస్తూ నోట్ల మార్పిడి చేసి భారీగా సంపాదించినట్టు తెలడంతో పోలీసులు అవాక్కయ్యారు.
ఈ దందాతో కృష్ణారెడ్డి కోటీశ్వరుడు అయ్యాడని తెలుసుకుని పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. కృష్ణారెడ్డిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో గత నెల 23న దూలం సాయి, గొట్టిముక్కల రవిశరన్, భీమవరపు యజ్ఞప్రదీప్, నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తుల దగ్గర దొంగనోట్లు లభించడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు అదేరోజు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో మూలాలు కనుగొన్నారు.
నిందితుల నుంచి సేకరించిన సమాచారంతో అనపర్తిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా అసలు నిందితుడైన కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఒక సాధారణ తెల్లటి పేపర్‌పై రూ.200, 500 నోట్లను రెండు వైపులా అంటించి ముద్రించడం, ఎటువంటి తేడాలు లేకుండా కట్ చేయడం, శుభలేఖల పేపర్‌పై నిజమైన నోట్ల మాదిరిగా వాటిని ముద్రించడాన్ని స్వయంగా చూసిన పోలీసులు షాకయ్యారు. తాను వడ్డీకి తిప్పే నగదు కట్లలో ఐదు దొంగ నోట్లు ఉంచి నోట్ల మార్పిడి చేసేవాడినని నిందితుడు పోలీసులకు తెలిపాడు.
ఇంతే కాకుండా అనపర్తి పెట్రోల్ బంకులో పని చేసే వ్యక్తికి కమీషన్ ఇచ్చి నోట్ల మార్పిడి చేశానని వెల్లడించాడు. కృష్ణారెడ్డి దొంగనోట్ల మార్పిడిని రెండేళ్ల నుంచి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.2కోట్లు వెనకేసి ఉంటాడని భావిస్తున్నారు. నోట్లు ముద్రించే కృష్ణారెడ్డితో పాటు సహకరించిన అనపర్తికి చెందిన దొరబాబును ఇబ్రహీంపట్నంకు చెందిన నలుగురు యువకులను పోలీసులు రిమాండ్‌కు పంపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more