KCR is similar to Evil Basmasura: Revanth సీఎం కేసీఆర్ ను భస్మాసురుడితో పా్ల్చిన రేవంత్ రెడ్డి

One generation lost government employement in telangana revanth reddy

Reventh Reddy, CM KCR, Youth Employement, one generation lost employement, BC, SC, ST groups lost employement, one employement one house, Election Promise, district tours, TRS, congress, congress Vs TRS, Basmasura, Telangana, Politics

TPCC Chief Revanth Reddy alleges one Generation lost Government Employement in Telangana as the TRS Government had not issued any notification since its seven years Rule.

ఉద్యోగాలు లేక.. తెలంగాణలో ఒక తరం నష్టపోయింది: రేవంత్ రెడ్డి

Posted: 06/30/2021 03:58 PM IST
One generation lost government employement in telangana revanth reddy

ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు లేకపోవడం తెలంగాణ రాష్ట్రంలో ఒక తరం ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం అయ్యిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఏడేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలోని బీసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువత తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆరోపించారు. హైదరాబాదులో డీసీసీ అధ్యక్షులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. బిసి, ఎస్సీ వర్గాలకు ఉద్యోగాలు లభిస్తాయన్న తెలిసి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం లేదని.. దీంతో ప్రభుత్వం మాట్లల్లో చూపించే ప్రేమ ఒకటి.. చేతల్లో మరోటి చేస్తుందని తేలిపోయిందని అన్నారు.

కరోనా వల్ల పేదల జీవితాలు చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన రాష్ట్ర ప్రజలను ఓ వైపసు కరోనా మరోవైపు కేసీఆర్ వేధిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ అధికారానికి దూరమౌతేనే అన్ని సమస్యలు పోతాయని అన్నారు. ఏ ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ ను గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ కూడా భస్మాసురుడి లాంటివారేనని ఆయన విమర్శించారు. ఆయన కూడా  తన తలపై తానే చెయి పెట్టుకునే తరహాలోనే ఆయన గత ఉద్యమ నేపథ్యమంతా సాగిందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఎప్పుడు రద్దు చేస్తారో తెలియదని అన్నారు.

రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే కేసీఆర్‌ గద్దె దిగాల్సిందేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని  . కేసీఆర్‌ ఈ మధ్యే బయటకు వస్తున్నారు.  ఏడేళ్లుగా దళితులపై దాడులు, అక్రమ అరెస్టులను పట్టించుకోలేదు. దళిత సాధికారత సమావేశాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారు. తెలంగాణ సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కేవలం మూడు శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నారు. బీసీ కార్పొరేషన్‌ల ద్వారా రావాల్సిన నిధులు కూడా రావడం లేదు’’ అని రేవంత్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reventh Reddy  CM KCR  Youth Employement  TRS  congress  KCR  Coronavirus  congress Vs TRS  Basmasura  Telangana  Politics  

Other Articles