AP SSC, Intermediate exams 2021 cancelled ‘సుప్రీం’ హెచ్చరికలతో ఏపీలో 10, ఇంటర్ పరీక్షల రద్దు

Ap board exams 2021 ssc inter exams cancelled by andhra government

Andhra pradesh intermiediate exams, andhra pradesh class 12th exam, ap ssc, ap inter exam, ap board exam news, Supreme court, Intermediate exams, student, fatality, RS 1 Crore Compensation, supreme court, Andhra Government, Fatality, class 12 exams, class 10th exams, Intermediate exams, Andhra pradesh

Andhra Pradesh Board of Intermedia Examination, BIE AP Inter Exams 2021 and AP SSC Exams 2021 have been cancelled. The state’s Education Minister, Audimulapu Suresh has informed that the AP Inter 2nd Year Exams 2021 for class 12 students along with AP SSC Class 10 Exams 2021 have stand cancelled.

‘సుప్రీం’ హెచ్చరికలతో తగ్గిన ఏపీ సర్కార్.. పది, ఇంటర్ పరీక్షల రద్దు

Posted: 06/24/2021 09:50 PM IST
Ap board exams 2021 ssc inter exams cancelled by andhra government

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చింది. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. కరోనా థర్డ్ వేవ్, డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావంతో దేశవ్యాప్తంగా తీవ్ర అందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. తరగతి గదుల్లో పరీక్షలను నిర్వహించదలిచామన్న ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా అక్షేపించిన న్యాయస్థానం ఈ క్రమంలో ఒక్క విద్యార్థి కూడా కరోనా కారణంగా మరణించినా వారికి పరిహారంగా కోటి రూపాయలను చెల్లించాల్సివుంటుందని.. ఆ మేరకు తాము తీర్పును ఇవ్వవచ్చునని చెప్పింది.

అదీ కాక డెల్టా ప్లస్ వేరియంట్ తీవ్రత ఎలా వుంటుందో, అది ఎంతటి ప్రభావాన్ని చాటుతుందో తెలియక అందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం లోపం లేదని, అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రయత్నించామని చెప్పారు.

అయితే, సుప్రీంకోర్టు సూచన మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నామని, విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని, జులై 31 లోపే ఫలితాలు ప్రకటించడం ఆచరణలో కష్టమని అభిప్రాయపడ్డారు. టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు ఎలా ఇవ్వాలన్న దానిపై విధివిధానాల రూపకల్పనకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇతర బోర్డు పరీక్షల రద్దుతో మన విద్యార్థులకు నష్టం జరగదని భావిస్తున్నామని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles