fisherman finds fireball whiskey bottle in a fish మత్స్యకారుడిని వరించిన అదృష్టం.. నడిసంద్రంలో మద్యం..

A fisherman finds an unopened whiskey bottle in a fish s stomach

fireball whisky, fish’s stomach, whiskey bottle, fish, fishermen, TikTok, viral, viral video, Liquor, Alcohol,

The sight of a fisherman finding an unopened bottle of whisky in a fish is the viral video of the day. In the clip, the fisherman can be seen popping the fish on a table to be filleted, first carving off a large piece and then starts working on the innards.

ITEMVIDEOS: మత్స్యకారుడిని వరించిన అదృష్టం.. నడిసంద్రంలో మద్యం..

Posted: 06/23/2021 02:34 PM IST
A fisherman finds an unopened whiskey bottle in a fish s stomach

అదృష్టం మీ వంతులో ఉంటే అది భూమి పోరల్లో దాగి వున్నా వచ్చి చేరుతుందని పెద్దలు చెప్పేవాళ్లు. సరిగ్గా అదే జరిగిందీ ఈ మత్స్యాకారుడికి. స‌ముద్రంలో చేప‌ల వేట ఒక్కో రోజు ఓక్కో అనుభవాన్ని మిగిల్చుతుంది. రోజంతా వేట కొన‌సాగినా ఓసారి నిరాశ‌తో వెనుతిర‌గాల్సి రావొచ్చు. మ‌రోరోజూ అనుకోని విధంగా ఆశించిన దానికంటే ఎక్కువే ద‌క్కొచ్చు. ఈ విధంగానే ఓ యువ మ‌త్స్య‌కారుడు జాక్ పాట్ కొట్టేశాడు. వేట‌లో అత‌డికి పెద్ద చేప దొర‌క‌డ‌మే కాదు. దాని లోప‌ల అనుకోని విధంగా మ‌ద్యం ఫుట్‌ బాటిల్ కూడా ల‌భించింది.

ల‌క్కీ మ్యాన్‌.. క్యాచ్ ఆఫ్ ది డే అంటూ సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అయింది. చేప‌ల వేట అనంత‌రం ఓ పెద్ద చేప‌ను మ‌త్స్య‌కారుడు బోటులోని టేబుల్‌పై ఉంచి క‌త్తితో త‌న నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం ప్రారంభించాడు. ఇలా చేప‌ను క‌ట్ చేసి శుభ్ర‌ప‌రుస్తుండ‌గా చేప క‌డుపు లోప‌లి భాగాల్లో అనుకోని విధంగా ఓ ఆబ్జెక్ట్ ఉన్న‌ట్లుగా గుర్తించాడు. క‌త్తితో కోసి చూడ‌గా విస్కీ ఫుల్ బాటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో అత‌ని సంతోషానికి అవ‌దులు లేకుండా పోయాయి.

టిక్‌టాక్ యూజర్ బెనిబాన్ దీన్ని పంచుకోవ‌డంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. వీడియో దాదాపు 6 మిలియన్ల వీక్షణలను సంపాదించింది. అయితే వీడియో ఎక్కడ చిత్రీకరించబడిందో స్ప‌ష్టంగా తెలియ‌రాలేదు. కాగా ఈ వీడియో ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. బాధ్యతా రహితమైన మానవ ప్రవర్తన ఇలా జంతుజ‌లాల‌కు ఏ విధంగా ముప్పును క‌లిగిస్తుందో స్ప‌ష్ట‌మౌతుంద‌ని పేర్కొన్నారు. మ‌రికొంద‌రు ప్ర‌చారం కోసం అత‌డే చేప క‌డుపులో బాటిల్ చొప్పించి ఉండ‌వ‌చ్చ‌ని వాదిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fireball whisky  fish’s stomach  whiskey bottle  fish  fishermen  TikTok  viral  viral video  Liquor  Alcohol  

Other Articles

Today on Telugu Wishesh