L Ramana set to join TRS ranks టీడీపీ పార్టీని వీడాలని ఎప్పుడు అనుకోలేదు.. కానీ: ఎల్ రమణ

Wooed by both trs and bjp telangana tdp chief l ramana finds himself in a quandary

L Ramana to join TRS, L Ramana to get MLC post, L Ramana to contest from Huzoorabad, L Ramana BC votes, Telangana TDP , Telangana Telugu Desam Party, NT RamaRao, TDP Founder President, TTDP President L Ramana, TRS, BJP, Karimnagar, Telangana, Politics

Telangana TDP president has reportedly decided to join TRS. He is said to have held discussions with his associates and explained that he felt it was better to accept TRS offer. Ramana’s entry into TRS is expected to strengthen BC votes. Ramana has been promised an MLC seat, according to sources.

టీడీపీ పార్టీని వీడాలని ఎప్పుడు అనుకోలేదు.. కానీ: ఎల్ రమణ

Posted: 06/14/2021 11:04 AM IST
Wooed by both trs and bjp telangana tdp chief l ramana finds himself in a quandary

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ మారుతున్నారని, సైకిల్ దిగి.. కారెక్కుతున్నారని  జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కమలంతో పాటు కారు కూడా తన ఎదుట ప్రతిపాదనలు పెట్టాయని వాటిలో ఆయన కారు ప్రయాణానికే సుముఖత వ్యక్తం చేశారని కూడా వార్తలు వినిపించాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ పార్టీ తన ముందు ప్రతిపాదనలు పెట్టలేదని, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను గమనించడం జరుగుతోందన్నారు ఎల్ రమణ. దీనిపై తన సన్నిహతులు, ఇతరులతో చర్చించడం జరిగిందని, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పార్టీ మార్పుపై 2021, జూన్ 14వ తేదీ సోమవారం ఉదయం జగిత్యాలలో ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు.

తాను ఓ శుభకార్యం నిమిత్తం జగిత్యాలకు రావడం జరిగిందన్నారు. ఊహించని రీతిలో రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయని, ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఎన్టీరామారావు పార్టీ పెట్టిన సందర్భంలో…యువకుడిగా ఉన్నప్పుడు టీడీపీలో చేరినట్లు చెప్పారు. ప్రజాగర్జన పెట్టిన సమయంలో…చాలా మంది పాల్గొన్నారని తెలిపారు. రాజకీయాల్లో ఒక నూతన ఒరవడి ఎన్టీఆర్ సృష్టించారని, రాజకీయాలు చిన్నతరం నుంచే ప్రారంభించానన్నారు. సామాన్య, సాధారణమైన కుటుంబంలో జన్మించానన్నారు. పది సార్లు బీఫాంపై పోటీ చేసినట్లు, నాటి నుంచి నేటి వరకు తాను పనిచేయడం జరిగిందన్నారు.

జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాలతో ప్రజల ముందుకు రావడం జరిగిందన్నారు. టీడీపీ పార్టీ ఇచ్చిన ప్రతి పనిని నెరవేర్చడం జరిగిందని, ఊహించని రీతిలో ఇబ్బందులు పడడం జరిగిందన్నారు. అధికారంలో లేకున్నా..ముందుకెళ్లామని, అనేక ఎన్నికల్లో అటుపొట్లను ఎదుర్కొన్నామన్నారు. 2014 తర్వాత.. రైతుల ఆత్మహత్యలు పాల్పడుతుంటే.. టీడీపీ శ్రేణులను కదిలించి.. 600 కుటుంబాలను కలవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని మెప్పించి..రైతు బీమా కల్పించే విధంగా కృషి చేశామన్నారు.

ప్రజా జీవితంలో మరింత ముందుకెళ్లాలని, మంచి నిర్ణయంతో ముందుకు రావాలని తన సహచరులు చెప్పారన్నారు. పార్టీ మారుతున్నట్లు తాను ఎక్కడా చెప్పలేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదని, కానీ తాను ప్రతిపాదనల కోసం పని చేయనని, ప్రజల కోసం పని చేస్తానన్నారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదని, ప్రజల మనోభావాల అనుగుణంగా పని చేస్తానన్నారు. తనవల్ల ఇబ్బందులు కలిగితే..క్షమించాలని, ఎవరు ఏ బాధ్యత ఇస్తే..అది చేయడమే తన బాధ్యత అన్నారు ఎల్.రమణ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles