Four Crore Covaxin Doses Missing? నాలుగు కోట్ల కోవాగ్జీన్ డోసులు మాయం..

Four crore covaxin doses missing production and inoculation estimates dont quite add up

Bharat Biotech, COVAXIN, Krishna Ella, vaccine, Union Government, covaxin production, covaxin inoculation, vaccine diplomacy, 4 crore vaccine missing

India administered about 2.1 crore Covaxin doses till date. Accordly, more than 6 crore doses should have been in circulation. Bharat Biotech on April 20 had said on record that 1.5 crore doses had been produced in March and that April would end with the month’s output at 2 crore doses.

నాలుగు కోట్ల కోవాగ్జీన్ డోసులు మాయం.. లెక్కల చిక్కులు తేలేదెట్లా.?

Posted: 05/28/2021 02:07 PM IST
Four crore covaxin doses missing production and inoculation estimates dont quite add up

హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లలో 4 కోట్ల కొవాగ్జిన్ షాట్స్ మిస్ అయ్యాయన్న వార్తలు గుప్పుమన్నాయి. అందుబాటులో ఉన్న అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 10 లక్షల కొవాగ్జిన్ డోసులు ఇచ్చారు. భారత్ బయోటెక్, కేంద్రం పలు సందర్భాల్లో చేసిన ప్రకటనల ప్రకారం చూస్తే.. ఇప్పటి వరకు 6 కోట్ల డోసుల కొవాగ్జిన్ దేశంలో అందుబాటులో ఉండాలి. మరి 6 కోట్ల కొవాగ్జిన్ డోసుల్లోంచి 2 కోట్ల 10 లక్షల ఇచ్చినట్టయితే.. మిగిలిన దాదాపు 4 కోట్ల కొవాగ్జిన్ డోసులు ఏమైయ్యాయన్నది.. మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.  

జనవరి నుంచి ఇప్పటివరకు ‘8 కోట్ల కోవాగ్జిన్ డోసులను భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసింది. అందులో వాక్సీన్ డిప్లోమసీలో భాగంగా 2 కోట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేశారు. ఈ మేరకు భారత్ భయోటెక్ ఇచ్చిన ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. కాగా మిగిలిన 6 కోట్ల డోసుల్లో 2 కోట్ల డోసులు దేశీయంగా ప్రజలకు ఇవ్వగా, మరో 4 కోట్ల డోసులు ఏమయ్యాయనేదే ప్రస్తుతం ఓ పజిల్‌గా మారింది. ఏప్రిల్‌ 20న భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా చెప్పిన వివరాల ప్రకారం.. మార్చిలో కోటిన్నర డోసులు.. ఏప్రిల్‌లో మరో 2 కోట్ల డోసులు ఉత్పత్తి చేసింది. మే నెలలో మూడు కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని కూడా చెప్పారు. కానీ మేలో 2 కోట్ల డోసులు ఉత్పత్తి అయ్యాయంటున్నారు.

ఈ లెక్కల ప్రకారం మార్చి, ఏప్రిల్‌, మే నెలల మొత్తం డోసులు ఐదున్నర కోట్లు. దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో పాటు కేరళ హైకోర్టులకు ఈ నెల 24న సమర్పించిన రెండు అఫిడవిట్లలోనూ ఇదే విషయాన్ని కేంద్రం సమర్పించింది. ప్రతీ నెలకు రెండు కోట్ల కొవాగ్జిన్‌ డోసులు ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. ఈ లెక్కల ప్రకారం మొత్తం ఐదున్నర కోట్ల డోసులు ఇప్పటి వరకు అందుబాటులోకి రావాలి. ఇక దీనికి తోడు జనవరి 5న కృష్ణ ఎల్లా చెప్పిన వివరాల ప్రకారం.. అప్పటికే రెండు కోట్ల డోసులు ఉత్పత్తి చేసి, సిద్ధంగా ఉంచింది. ఇవీ కాకుండా జనవరి, ఫిబ్రవరి నెలలో ఉత్పత్తి చేసిన వాక్సీన్లు ఏమయ్యాయన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

జనవరి 5 నుంచి ఫిబ్రవరి వరకు ఉత్పత్తిని పక్కబనెట్టినా దేశంలో సంస్థతో పాటు కేంద్ర చెప్పిన లెక్కల ప్రకారం ఏడున్నర కోట్ల కొవాగ్జిన్‌ డోసులు అందుబాటులో ఉండాలి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉత్పత్తి తక్కువగా ఉంది. అవి కూడా కలుపుకొంటే.. మొత్తం మీద భారత్‌ బయోటెక్‌ నుంచి ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌ డోసులు 8 కోట్లుగా ఉంటుందని అంచనా. భారత్‌ నుంచి ఇప్పటి వరకు ఆరు కోట్ల అరవై లక్షల డోసులు వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయని చెబుతున్నారు. అందులో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులే ఎక్కువగా ఉన్నామని సమాచారం. అలా చూసినా అందుబాటులో ఉండాల్సిన ఆరు కోట్ల డోసుల..లో రెండుకోట్ల పది లక్షల డోసులు వినియోగించగా.. మిగిలిన డోసులు ఏమయ్యాయి. ఇక్కడ కూడా లెక్కల మాయేనా.? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles