Lady doctor appeal before losing battle to Corona కరోనాపై మహిళా డాక్టర్ చివరి సందేశం.. నెట్టింట్లో వైరల్

Lady doctor appeal before losing battle to corona goes viral online

Pregnant Doctor, pregnency during covid, Dr Dimple Arora Chawla, Delhi doctor emotional video, pregnant doctor dies of covid-19, Ravish Chawla, covid during pregnancy, pregnant mother covid, coronavirus, pregnant woman dies, pregnant doctor dies, Lady doctor, Delhi doctor Emotional video, covid-19

A Lady Doctor from Delhi appeals people not to take Coronavirus on easy note before losing battle to covid-19 goes viral online, after her husband shares her emotional video on net.

కరోనాపై మహిళా డాక్టర్ చివరి సందేశం.. నెట్టింట్లో వైరల్

Posted: 05/12/2021 01:50 PM IST
Lady doctor appeal before losing battle to corona goes viral online

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగోన్న విషయం తెలిసిందే. అయితే కరోనా పెద్ద రోగం కాదని.. కేవలం అంటువ్యాధి మాత్రమేనని పలువురు రోగులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నావాస్తవానికి మాత్రం కరోనా నుంచి అప్రమత్తత ఎంతో అవసరమని దాని బారిన పడిన రోగుల అభిప్రాయం. కరోనా మహమ్మారిని నయం చేయడంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది క‌రోనా బాధితుల‌ను కాపాడేందుకు నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక కరోనా తొలిధశ కన్నా రెండో దశ మరింత ఉద్దృతంగా తన ప్రభావాన్ని చాటుతుందని ఇప్పటికే వైద్యులు చెబుతున్నారు.

అందుకు క‌రోనా సెకెండ్ వేవ్‌లో దేశంలో పరిస్థితి మ‌రింత‌ దిగజారడమే కారణంగా పేర్కొంటున్నారు. కరోనా రెండో దశను కట్టడి చేయడానికి ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఇటు తెలంగాణలో ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ ప్రకటన వెలువడగానే ముందుకు మద్యం దుకాణాల వద్దకు మందుబాబులు బారులు తీరారు. సామాజిక దూరం గాలికి వదిలి నెట్టుకుంటూ మద్యం కొనుగోలు చేయడంలో పోటీపడ్డారు. ఇలా కొంద‌రు క‌రోనా విష‌యంలో త‌మ‌ నిర్ల‌క్ష్యాన్ని వీడ‌టం లేదు. తాజాగా ఢిల్లీకి చెందిన ఒక  వైద్యురాలు క‌రోనాను తేలిక‌గా తీసుకోకూడ‌దంటూ అందించిన సందేశం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ఢిల్లీకి చెందిన డాక్టర్ దీపికా అరోరా చావ్లా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళే ముందు త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కారు. కరోనాను ఎవరూ తేలికగా తీసుకోకూడదని, ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాల‌ని, సామాజిక దూరాన్ని త‌ప్ప‌క పాటించాల‌ని ఆమె కోరారు. కరోనా రోగులకు చికిత్స చూస్తూన్న అమె కరోనా బారిన పడ్డారు. అయితే తాను గర్భవతినన్న విషయం తెలిసిన అమె అన్ని రకాలా జాగ్రత్త చర్యలు పాటిస్తూనే వున్నా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అమె కరోనా ప్రభావానికి గురయ్యారు. ఏప్రిల్ 11 న డాక్ట‌ర్ దీపిక క‌రోనా బారిన ప‌డ‌గా, ఏప్రిల్ 26 న ఆమె క‌న్నుమూశారు.

తన భార్య అందించిన‌ చివ‌రి వీడియోను భ‌ర్త ర‌వీష్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.  క‌రోనా విష‌యంలో అంద‌రూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో కొట్టుమిట్ట‌డుతున్న స‌మయంలో త‌న భార్య త‌న గురించి, త‌మ మూడేళ్ల కుమారుని గురించి తపించిపోయార‌న్నారు. అలాగే ఆమె క‌డుపులో ఉన్న శిశువు గురించి కూడా వేద‌న చెందార‌న్నారు. కాగా భార్య‌ను, పుట్ట‌బోయే బిడ్డ‌ను కోల్పోయిన ర‌వీష్‌... మరెవ‌రికీ ఇటువంటి ప‌రిస్థితి రాకూడ‌ద‌ని కోరుకుంటూ ఆమె చివ‌రి వీడియోను సోష‌ల్ మీడియ‌లో షేర్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lady doctor  Dimple Arora Chawla  Delhi doctor  Emotional video  Ravish chawla  coronavirus  covid-19  

Other Articles

Today on Telugu Wishesh