Telangana lockdown: Liquor shops open for 4 hours మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రతీ రోజు 4 గంటలు మద్యం అమ్మకాలు

Liquor shops to be open in telangana for four hours from 6 am

Telangana Lockdown, Telangana Liquor shops, Telangana Excise Department, Lockdown In Telangana, Hyderabad Lockdown, Lockdown In Telangana, Telangana Cm, K Chandrasekhar Rao, Kcr Cm, Telangana Cabinet Meeting Today, Kcr Cabinet Meeting Today, Lockdown States In India, Kcr Telangana Cm, Telangana News Lockdown, Telangana, K. Chandrashekar Rao, Chief minister, Lockdown

All liquor shops will remain open from 6 am to 10 am. 'Shop owners should immediately put up boards displaying the information to control the crowd,' said the Minister of Excise department. The Excise Officials should also attend the duties from 8 Am to 10 AM.

మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రతీ రోజు 4 గంటలు మద్యం అమ్మకాలు

Posted: 05/11/2021 11:58 PM IST
Liquor shops to be open in telangana for four hours from 6 am

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఉదయం పది గంటల నుంచి లాక్ డౌన్ విధించిన ప్రకటనను రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో వెలువరించగానే తొలుత మద్యం దుకాణాల వద్దకు మందుబాబులు బారీ సంఖ్యలో క్యూ కట్టిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మంత్రివర్గం సమావేశం దృష్టికి కూడా ఈ వీడియోలు చేరడంతో తెలంగాణలోని మందుబాబులకు క్యాబినెట్ సమావేశం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ సమయంలో వైన్ షాపులు కూడా మూతపడతాయని భావించిని వినియోగదారులు.. వైన్ షాపుల వద్ద ఎగబడతున్నారు.

అయితే మద్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి అనుమతులివ్వాలని డిస్టిలరీ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. వైన్ షాపులు మూసివేస్తే ఆర్థికంగా ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుంది. దాంతో ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వైన్ షాపులను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు తెరచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ప్రస్తుతం ఏపీలో కూడా ఉదయమే మద్యం దుకాణాలను తెరుస్తున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్​డౌన్​ ఖరారైంది. అయితే లాక్​డౌన్​లో నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలతో ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఖరారు చేస్తోంది. పాలు, కూరగాయల దుకాణాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా ఉదయమే తెరిచి ఉంచుకోవాలని సూచిస్తోంది.

ప్రస్తుతం మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల తర్వాతే తెరుస్తుండగా… ఇప్పుడు ఉదయం 10 గంటల తర్వాత మూసివేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మందుబాబులు లాక్​డౌన్​లో మద్యం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో లాక్​డౌన్​ ఉంటుందని చాలాచోట్ల నెలకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం లాక్​డౌన్​ నేపథ్యంలో మద్యం దుకాణాలు తెరచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఇక ఎక్సైజ్ అధికారులు కూడా ఉదయం 8 గంటల నుంచి పది గంటల వరకు విధులను తప్పక నిర్వహించాలని అదేశాలను జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Lockdown  Liquor shops  Telangana Excise Department  Cabinet meet  Telangana  Crime  

Other Articles