Toll booths to be removed within 1 year: Nitin Gadkari నూతన స్క్రాపింగ్ విధానాలు ఇవే..

Nitin gadkari announces vehicle scrappage policy in lok sabha

vehicle scrappage policy announced, vehicle scrappage policy, Vehicle Scrappage, Scrappage policy, Nirmala Sitharaman, Nitin gadkari, toll plaza, GPS plaza, no traffic jams, FasTags, Highways, Police enwuiry, Business news

According to Nitin Gadkari, Road Transport and Highways Minister, who said that within a year all the tolls will be removed from the highways. Instead, the toll collection will be done through GPS.

ఏడాది తరువాత టోల్ ప్లాజాలు కనిపించవ్.. జీపీఎస్ ట్యాగింగ్: గడ్కారీ

Posted: 03/18/2021 06:04 PM IST
Nitin gadkari announces vehicle scrappage policy in lok sabha

కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్యే అధికంగా ఉందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని తెలిపారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ... ‘‘రోడ్డు ప్రమాదాల విషయంలో కేంద్రం తీవ్ర ఆందోళనగా ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీనిపై చాలా సీరియస్ గానే ఉన్నాం. కరోనా కారణంగా 1.46 లక్షల మంది మరణించారు. కానీ రోడ్డు ప్రమాదాలతో 1.5 లక్షల మంది మృతి చెందారు.’’ అని గడ్కరీ వివరించారు.

అయితే ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారందరూ 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు వారేనని గడ్కరీ వెల్లడించారు. ఇక కేంద్రబడ్జెట్ సందర్భంగా విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్, స్క్రాపింగ్ విధానాలను తెలిపారు. అయితే ఇవాళ అదే విషయమై కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ నూతన స్క్రాపింగ్ విధానంపై పార్లమెంటులో సబ్యులకు వివరించారు. నూతన స్ర్కాపింగ్ విధానం ప్రకారం ప్రైవేటు వాహనాలకు ఇరవై ఏళ్లు..కమర్షియల్ వాహనాలకు పదిహేనేళ్ల పరిమితిని విధించారు.

ఇక ఈ కాలపరిమితి పూరైన్న ఫిట్ నెస్ లేని వాహనాలను యజమానులే అధికారిక స్క్రాపింగ్ కేంద్రాలలో అప్పగిస్తే వారికి నూతన వాహనాలు తీసుకోవడంలో రాయితీలతో పాటు పలు ఇన్సెంటివ్ లు కూడా లభిస్తాయని గడ్కరీ అన్నారు. కొత్త వాహనం కోలుగోలు చేసే సమయంలో 4 నుంచి 6శాతం మధ్య వీరికి రాయితీ లభిస్తుందని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రోడ్డు పన్నులో ప్రైబేటు వాహనాలకు 25శాతం.. కమర్సియల్ వాహనాలకు 15శాతం రాయితీ ఇస్తారని, అదే సమయంలో వాహన అమ్మకం దారుల నుంచి కూడా ఐదు శాతం రాయితీ లభిస్తుందని నితిన్ గడ్కారీ తెలిపారు.

అదే సమయంలో దేశంలోని టోల్ ప్లాజాలన్నింటినీ ఒక ఏడాదిలో పూర్తిగా తొలగిస్తామని ఆయన తెలిపారు. ఇకపై టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ లకు తావులేకుండా చేస్తామన్నారు. టోల్ ప్లాజాల స్థానంలో ఇకపై జీపీఎస్ ప్లాజాలతో అధునీకరించనున్నామని తెలిపారు. దేశంలో ఇప్పటికే 97శాతం మంది తమ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ ధరించారని, అయితే కేవలం 7శాతం వాహనాలు మాత్రం ఇంకా ఫాస్ట్ ట్యాగ్ లేకుండా వెళ్తున్నాయని.. వీరు టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు డబ్బు కడుతున్నారని పేర్కోన్నారు. ఇక ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలను విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా పోలీసులను అదేశించామని గడ్కారీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles