Push Ups on Moving Car Video Goes Viral కదిలే కారుపై ఫుష్-అప్స్.. పోలీసుల రివార్డు..

Man does push ups atop moving car up police rewarded him

Push Ups on Moving Car, push-ups on moving car goes Viral, push-ups Video Goes Viral, push-ups on Mahindra Scorpio, Ujjwal Yadav, push-ups, moving car, apology, Firozabad, UP Police, Uttar Pradesh, viral video, video viral, Crime

A man in Uttar Pradesh was "rewarded" a challan for "working out" as he did push-ups on the roof of a moving car. Following which UP Police shared a short clip of Ujjwal Yadav pulling off the dangerous stunt and conveyed that it is a punishable offence

ITEMVIDEOS: కదిలే కారుపై యువకుడి ఫుష్-అప్స్.. పోలీసుల రివార్డు..

Posted: 03/16/2021 03:52 PM IST
Man does push ups atop moving car up police rewarded him

పుష్-అప్స్ సాధారణంగా ఇప్పటి యువత జిమ్ లలో చేస్తుంటారు. ఇక మధ్యతరగతి కుటంబాలకు చెందిన వారైతే ఇంట్లోనే చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతం యువత అయితే పోలాల్లోనే లేక, వ్యాయామ కేంద్రాల్లోనో చేస్తుంటారు. కానీ, ఎంతో సాహసంతో ఈ కుర్రాడు మాత్రం ఏకంగా కారుపైన పుష్-అప్స్ చేసి అందరిచేత ఔరా అనిపించుకున్నాడు. కారులో ఎవరూ లేని సమయంలో తానే కారును నడుపుతూ.. ఒక్కసారిగా స్టీరింగ్ సీటును వదిలి కారు టాప్ పైకి ఎక్కి.. అక్కడ పుష్-అప్స్ చేయడమంటే సాధారణ విషయం కాదు.

కేవలం సినిమాల్లో మాత్రమే నిష్ణాతులైన నిపుణుల చేత ఇలాంటి స్టంట్లు చేయిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం ఎలాంటి ముందజాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఏకంగా కారు పైన పుషప్స్ కొట్టాడు. తాను చేసిన సాహసాన్ని వీడియో తీయించి.. తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంకేముంది. ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయ్యింది. ఎంతో శ్రమతో కూడిన ప్రాక్టీసుతోనే ఈ వీడియోలోని స్టంట్ చేశాడు. ఇది కాసింత అడ్డం తిరిగినా అతడికే ప్రమాదం.. అంతేకాదు ఎదురుగా వస్తున్న వాహనదారులకుకూడా ప్రమాదకరమే. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఉజ్వల్ యాదవ్ అనే యువకుడు ఈ స్టంటు చేశాడు.

ఈ వీడియోపై సంబంధిత పోలీసులు కూడా బాగానే స్పందించారు. పుష్-అప్స్  అయితే బాగానే కొట్టావ్.. మరి, మా రివార్డు కూడా అందుకోవాలిగా.. రా రాజా వచ్చి మా రివార్డును అందుకో.. అంలూ ఉజ్వల్ యాదవ్ ఇంటికి చలానా పంపించారు. దానికి సంబంధించిన వీడియోనూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘కొన్ని కొన్ని పుషప్ లు చట్టం కళ్లలో పడేలా చేస్తాయి. జర భద్రం’’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియో తర్వాత ఓ సందేశాన్నీ ఇచ్చారు. ‘‘డ్రైవింగ్ చేసేటప్పుడు స్టంట్స్ చేయడం నేరం.  దాని వల్ల మీకు, ఎదుటి వారికి ప్రమాదకరం కావొచ్చు’’ అని పేర్కొంటూ వీడియోను ముగించారు.  ఇక, చేసిన తప్పునకు ఉజ్వల్ యాదవ్ క్షమాపణ చెప్పాడు. కారుపై ప్రమాదకర స్టంట్స్ చేసిన మాట నిజమేనని, ఇకపై ఎప్పుడూ ఇలా ప్రమాదకరంగా స్టంట్స్ చేయనని హామీ ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ujjwal Yadav  push-ups  moving car  apology  Firozabad  UP Police  Uttar Pradesh  viral video  video viral  Crime  

Other Articles