BMC fines 1.9 lakh people for not wearing masks ముంబైవాసుల్లో రాజ్యమేలిన నిర్లక్ష్యం.. కాసులు రాల్చిన వైనం..

In 12 days bmc fines 1 9 lakh people for not wearing masks

Mumbai covid cases, Mumbai covid norms, BMC on covid rules violation, Masks, Sanitizers, Mumbai face mask violation, Mumbai Police on face mask fine, Mumbai no face mask fine, BMC on Covid norms, Uddhav thackeray on lockdown, Maharashtra, crime

With Covid-19 cases increasing in the city, so is the number of citizens violating face mask norms. In 12 days between February 27 and March 11, the Brihanmumbai Municipal Corporation (BMC) fined 1.9 lakh citizens for not wearing masks in public places.

ముంబైవాసుల్లో రాజ్యమేలిన నిర్లక్ష్యం.. కాసులు రాల్చిన వైనం..

Posted: 03/13/2021 03:32 PM IST
In 12 days bmc fines 1 9 lakh people for not wearing masks

కరోనా వైరస్ మళ్లీ చెలరేగిపోతున్నా ప్రజలు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. మన దేశంలో మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో కరనా వైరస్ జడలు విప్పి కరాళ నృత్యం చేసింది మహారాష్ట్రలోనే అని చెప్పక తప్పదు. అయితే దేశ ఆర్థిక రాజధాని కావడం మూలంగానో లేక మరేమి కారణమో తెలియదు కానీ.. ఇక్కడి ప్రజల్లో కరోనా అవగాహణ కన్నా నిర్లక్షమే అధికంగా రాజ్యమేలుతోంది. కరోనా మహమ్మారి తమ కళ్లెదులే అనేకమంది ప్రాణాలను బలిగొన్నా.. ఇక్కడి ప్రజల్లో మాత్రం నిర్లక్ష్యపు నీడలు తొలగడం లేదు.

కరోనా నేపథ్యంలో ఇళ్లకు మాత్రమే అధికమొత్తంలో ప్రజలు పరిమితం కావాల్సి వున్నా.. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారి సంఖ్యే అధికంగా మారుతోంది. అయితే ఏదో అవసరంపై బయటకు వెళ్తున్నారు అనుకుంటే.. వారు మహమ్మారి విజృంభిస్తున్నా.. కనీస జాగ్రత్తలు పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు. పెరుగుతున్న కేసులతో మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న ముంబైలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రజలు తమవారైనా.. వారి ప్రాణరక్షణకు కొరడా ఝళిపించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.

మరీముఖ్యంగా బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలో ప్రజలు ఎవరూ మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై నుంచి జరిమానాలు వసూలు చేస్తోంది. ఈ జరిమానాలు ఒక్కరోజు ఉదయం నుంచి సాయంకాలనికి ఏకంగా రూ.50 లక్షల వరకు వసూళ్లయ్యాయి. దీనిబట్టి ప్రజలు ఎంతమేరకు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపట్టిన తనిఖీల్లో మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన 24,226 మంది నుంచి ఏకంగా రూ.48.45 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేసింది. కాగా, గతేడాది ఏప్రిల్ 20 నుంచి ఇప్పటి వరకు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న 18,45,777 మంది నుంచి రూ. 37,27,45,600 వసూలు చేసినట్టు బీఎంసీ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  covid cases  Brihanmumbai Municipal Corporation  Covid norms  Masks  Sanitizers  Maharashtra  crime  

Other Articles