Farmer unions call for Bharat bandh on March 26 ఈ నెల 26న మళ్లీ భారత్ బంద్.. పిలుపునిచ్చిన రైతులు..

Farmer unions call bharat bandh on march 26 on completion of 4 months of protest

farmers rail roko, farmers candle march, protest delhi, farmers laws farm, farmers rail roko agitation, farmers protests, farmers protests delhi border, barricades at delhi border, singhu border farmers protests, police barricades, protest delhi, farmers laws farm, farmers tractor rally, farmers rally violent, farmers farm laws, delhi police, Intelligence bureau, supreme court committee, delhi, politics

Farmers' unions have called for a nationwide strike on March 26 when their ongoing protest at Delhi borders will complete four months, news agency PTI reported. Announcing their future programmes protesting the three agriculture laws enacted by Parliament in 2020, the farmers' unions said that some trade unions will also join them in their protest against fuel price hike on March 15.

ఈ నెల 26న మళ్లీ భారత్ బంద్.. పిలుపునిచ్చిన రైతులు..

Posted: 03/11/2021 03:02 PM IST
Farmer unions call bharat bandh on march 26 on completion of 4 months of protest

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వంద రోజులకు పైగా దేశరాజధాని ఢిల్లీ శివార్లలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నా లక్ష్యపెట్టని ప్రభుత్వానికి తామును ఇలానే వదిలేసి.. తమ సహనాన్ని పరీక్షిస్తే లక్ష ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేసిన రైతులు సంఘలు తాజాగా మరోమారు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఉద్యమం నాలుగు నెలలు పూర్తి చేసుకోనున్న తరుణంలో తాము భారత్ బంద్ కు పిలుపునిస్తున్నామని రైతు సంఘలు పేర్కెన్నాయి.

కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను తక్షణం ఉపసంహరించుకునే వరకు తమ అందోళనలు కొనసాగుతూనే వుంటాయని తేల్చిచెప్పిన రైతు సంఘాలు.. దీంతో పాటు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు రానున్న మరికోన్ని రోజుల వ్యవధిలో మరిన్ని అందోళనలకు కూడా పిలుపునిస్తామని తెలిపాయి. తమ భవిష్యత్ నిరసన దీక్షల్లో పలు కార్మిక సంఘాల నేతల నుంచి కూడా మద్దతు లభించిందని పేర్కోన్నాయి. దేశంలో ఇంధన, గ్యాస్ ధరలు భారీగా ఎక్సైజ్ సుంకాన్నిపెంచి సమాన్యులపై భారం వేస్తున్న తరుణంలో వాటిని నిరసిస్తూ పలు కార్మిక సంఘాలు కూడా ఈ ఉద్యమాల్లో మార్చి 15 నుంచి తమ నిరసనల్లో పాల్గొననున్నాయని తెలిపాయి.

జనవరి 26న గణతంత్రదినోత్సవం నాడు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఉద్యమంలోని సంఘవిద్రోహశక్తుల్ని రానివ్వకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న రైతు సంఘాలు ఆ తరువాత ఫిబ్రవరి 26వ తేదీని అఖిల భారత వర్తక సమాఖ్య ఆధ్వర్యంలో జీఎస్టీ పన్నులను కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక మార్చి 26న నాటికి నాలుగు నెలలు పూర్తి కావస్తున్న తరుణంలో మరోమారు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రైతు సంఘాల నేతలు కూడా దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబడుతున్నారు. ఇటీవల 100 రోజులను పూర్తి చేసుకున్న నేపథ్యంలోనూ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles