BJP’s Subramanian Swamy takes dig at party బీజేపి కురువృద్ద నేతలకు ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సూచనలు

Bjp s swamy takes dig at party over e sreedharan s name for kerala cm

Bharatiya Janata Party (BJP), BJP, Rajya Sabha MP, Subramanian Swamy, ‘Metro Man’, E Sreedharan, as the CM candidate, LK Advani, Murali Manohar Joshi, ‘Margdarshak Mandal’, convenient spin, Kerala Assembly polls, Kerala, Politics

BJP leader and Rajya Sabha MP Subramanian Swamy put out a tweet questioning his party’s decision to nominate ‘Metro Man’ E Sreedharan as the chief ministerial candidate in the upcoming Kerala Assembly polls.

బీజేపి కురువృద్ద నేతలకు ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సూచనలు

Posted: 03/06/2021 02:58 PM IST
Bjp s swamy takes dig at party over e sreedharan s name for kerala cm

సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల నుంచి ఇంధన ధరలు పెంచకపోవడానికి అది కూడా ఓ కారణంగానే నిలుస్తోంది. రాముడు జన్మించిన భారత్ దేశంలో ఇంధన ధరలు ఇలా పెరుగుతున్నాయేంటని ప్రశ్నించిన ఆయన.. అదే సీతమ్మ జన్మించిన నేపాల్ లో ఇంధన ధరలను, రావణాసురుడు జన్మించిన శ్రీలంకలోని ఇంధన ధరలను పోల్చి తనదైన శైలిలో విమర్శనాస్త్రాన్ని సంధించడంలో ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోంది.

ఇక తాజాగా మరోసారి తనదైన శైలిలో బీజేపిని టార్గెట్ చేసిన ఆయన పార్టీ కురువృద్దులు, కీలక స్థంబాలైన నేతలను విషయమై కూడా స్పందించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా వయోవృద్ధుడైన మెట్రోమ్యాన్ శ్రీధరన్ ను ప్రకటించడంపై స్పందించిన ఆయన.. 75 ఏళ్లు పూర్తైన పార్టీ కీలక నేతలను పక్కనబెడుతున్న సంస్కృతిని అలవర్చుకున్న బీజేపి.. అమిత్ షా సహా అంతకుముందు రాజ్ నాథ్ సింగ్ నేతృత్వం నుంచి అలవర్చుకుంది. ఇదే సంస్కృతిని గత సార్వత్రిక ఎన్నికలలోనూ అలవర్చుకున్న బీజేపి.. ఇక జేపీ నడ్డా నేతృత్వంలో మాత్రం కేరళ రాష్ట్రానికి మిహనాయింపును కోరింది.

కేరళ సీఎం రేసులో 89 ఏళ్ల శ్రీధరన్ ను బీజేపి నిలిపింది. దీంతో తన పార్టీని తానే టార్గెట్ చేసుకున్న ఆయన.. మరోమారు ఘాటు ట్వీట్ ఇచ్చి పార్టీని, పార్టీ అధిష్టానాన్ని, పార్టీ  క్రియాశీలక క్యాడర్ ను ఇబ్బందుల్లోకి నెట్టారు. అయితే, 75 ఏళ్లకు పైబడిన వృద్ధ నేతలను మార్గదర్శన మండలి పేరుతో వనవాసానికి పంపే బీజేపీ ఇప్పుడు మెట్రోమ్యాన్ ను సీఎం అభ్యర్థిగా తీసుకువస్తోందని తెలిపారు. ఇక పార్టీని ఇన్నాళ్ల పాటు తమ భుజస్కంధాలపై మోసిన పార్టీ సీనియర్ నేతలు, కురువృద్ద నేతలైన లాల్ కిషన్ అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్ నేతకు ఆయన సచనలు చేశారు.

ఇద్దరు ఎంపీల నుంచి పార్టీని ఇంతటి స్థాయిలో నిలిపిన ఘనత సాధించేందుకు మూలస్థంబాలైన కురువృద్ధ నేతలు 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి సూచించారు. బీజేపీ అధినాయకత్వం 75 ఏళ్లకు పైబడిన వృద్ధులను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పిస్తున్న నేపథ్యంలో సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం అద్వానీ వయసు 93 ఏళ్లు కాగా, జోషి వయసు 87 సంవత్సరాలు. వారిద్దరి అనుభవం దృష్ట్యా పార్టీకి సలహాలు ఇచ్చే మార్గదర్శన మండలిగా వారిని పరిగణనలోకి తీసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles